ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Tsunami: 155 భూకంపాలు, పదుల సంఖ్యలో ప్రాణ నష్టం.. జపాన్‌ని వణికిస్తోన్న ప్రకృతి విపత్తులు

ABN, Publish Date - Jan 02 , 2024 | 10:30 AM

నూతన సంవత్సర తొలిరోజు జపాన్ ని(Japan Earthquake) వరుస భూకంపాలు వణికించాయి. దేశ వ్యాప్తంగా ఒకే రోజు దాదాపు 155 భూకంపాలు సంభవించాయని అధికారులు తెలిపారు. తొలి భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 7.6 గా నమోదైనట్లు వాతావరణ కార్యాలయం తెలిపింది. తొలి భూకంపం సంభవించిన వెంటనే అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు.

టోక్యో: నూతన సంవత్సర తొలిరోజు జపాన్ ని(Japan Earthquake) వరుస భూకంపాలు వణికించాయి. దేశ వ్యాప్తంగా ఒకే రోజు దాదాపు 155 భూకంపాలు సంభవించాయని అధికారులు తెలిపారు. తొలి భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 7.6 గా నమోదైనట్లు వాతావరణ కార్యాలయం తెలిపింది. తొలి భూకంపం సంభవించిన వెంటనే అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. 5 అడుగుల ఎత్తులో అలలు తీరాన్ని తాకాయి. దాదాపు 33,000 ఇళ్లకు విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. ప్రధాన రహదారులతో సహా దేశవ్యాప్తంగా అనేక రోడ్లకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి.

ప్రజలను కాపాడేందుకు ప్రయత్నిస్తున్న రెస్క్యూ సిబ్బంది, వైద్యులకు ఇబ్బందులు తప్పట్లేదు. భూకంపం ధాటికి వాజిమా పట్టణంలో 8 మంది మృతి చెందారని అధికారులు వెల్లడించారు. జపాన్ లోని ప్రధాన విమానాశ్రయాల రన్ వేపై పగుళ్లు ఏర్పడ్డాయి. దీంతో రెస్క్యూ ఆపరేషన్ కు అంతరాయం ఏర్పడింది. చాలా ప్రాంతాల్లో రైలు, విమాన సేవలు నిలిపేశారు. పోర్టుల వద్ద మునిగిపోయిన పడవలు. కాలిపోయిన గృహాలు కనిపిస్తున్నాయి. కరెంటు సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. అయితే రానున్న రోజుల్లో జపాన్ లో మరికొన్ని భూకంపాలు సంభవించవచ్చిన జపాన్ వాతావరణ కార్యాలయం చెప్పడం అక్కడి ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.


సహాయక చర్యలు వేగవంతం..

ప్రజలను కాపాడటానికి రెస్క్యూ టీం ఎప్పటికప్పుడూ అప్రమత్తంగా ఉండాలని ఆ దేశ ప్రధాని ఫుమియో కిషిడా అన్నారు. ప్రభుత్వం అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తుందని స్పష్టం చేశారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మాట్లాడుతూ.. జపాన్‌కు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. కష్టసమయాల్లో తమ మిత్రదేశానికి ఎల్లవేళలా సహాయ సహకారాలు అందిస్తామని స్పష్టం చేశారు.

Updated Date - Jan 02 , 2024 | 10:31 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising