ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hamas: ఇస్మాయిల్ ఇంటిపై దాడి, మృతి

ABN, Publish Date - Jul 31 , 2024 | 09:31 AM

హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియాపై ప్రత్యర్థులు దాడికి తెగబడ్డారు. టెహ్రాన్‌లోని ఆయన నివాసం లక్ష్యంగా దాడి చేశారు. దాంతో ఇస్మాయిల్ చనిపోయాడని ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ తెలిపింది. ఈ మేరకు రాయిటర్స్ వార్తా సంస్థ పేర్కొంది. ఖతార్‌లో ఇస్మాయిల్ హనియా మంగళవారం పలు రాజకీయ కార్యకలపాల్లో పాల్గొన్నారు. ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు.

Hamas leader Ismail Haniyeh

టెహ్రాన్: హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియాపై (Hamas leader Ismail Haniyeh)ప్రత్యర్థులు దాడికి తెగబడ్డారు. టెహ్రాన్‌లోని ఆయన నివాసం లక్ష్యంగా దాడి చేశారు. దాంతో ఇస్మాయిల్ చనిపోయాడని ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ తెలిపింది. ఈ మేరకు రాయిటర్స్ వార్తా సంస్థ పేర్కొంది. ఖతార్‌లో ఇస్మాయిల్ హనియా మంగళవారం పలు రాజకీయ కార్యకలపాల్లో పాల్గొన్నారు. ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనితో సమావేశం అయ్యారు. గాజాలో ఇజ్రాయెల్- పాలస్తీనా మధ్య యుద్ధం జరుగుతోంది. పాలస్తీనాకు చెందిన హమాస్ సంస్థ యుద్ధంలో పాల్గొంది. దాంతో గాజాలో ఇజ్రాయెల్ దళాలు భారీస్థాయిలో మృతిచెందారు. అందుకు ప్రతిగా ఇజ్రాయెల్ హమాస్‌ను లక్ష్యంగా చేసుకుంది. ఈ రోజు ఇస్మాయిల్‌పై దాడి చేసినట్టు తెలుస్తోంది. గత తొమ్మిది నెలల నుంచి గాజాలో యుద్ధం జరుగుతోన్న సంగతి తెలిసిందే.


నేపథ్యం ఇదే..

1962లో గాజాకు సమీపంలో ఓ శరణార్థి శిబిరంలో ఇస్మాయిల్ జన్మించాడు. 1980 చివరలో హమాస్‌లో చేరాడు. 1990లో ఇస్మాయిల్ హనియా పేరు ప్రపంచానికి తెలిసింది. హమాస్ వ్యవస్థాపకుడు అహ్మద్ యాసిన్‌కు సన్నిహితంగా మెలిగేవాడు. రాజకీయంగా సలహాలు ఇచ్చేవారు. అలా హమాస్‌లో క్రమంగా ఎదిగారు. 2004లో ఇజ్రాయెల్ చేసిన దాడిలో అహ్మద్ యాసిన్ చనిపోయారు. తర్వాత హమాస్‌లో ఇస్మాయిల్ కీలక వ్యక్తిగా మారారు.


హమాస్ చీఫ్‌గా..

2006లో పాలస్తీనా స్టేట్ ప్రధానిగా ఎంపికయ్యారు. గాజా పట్టిని కొద్దిరోజులు పాలించారు. 2007 జూన్‌లో పాలస్తీనా నేషనల్ అథారిటీ అధ్యక్షుడు మహ్మద్ అబ్బాస్ అతన్ని పదవి నుంచి తొలగించారు. అప్పటి నుంచి గాజాలో యుద్ధం మొదలైంది. అబ్బాస్ ఆదేశాలను సైతం ఇస్మాయిల్ ధిక్కరించాడు. పాలస్తీనా స్టేట్ ప్రధానిగా కొనసాగాడు. 2017లో హమాస్ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించారు. తర్వాత ఇస్మాయిల్‌ను అమెరికా ఉగ్రవాదుల జాబితాలో చేర్చింది. 2019లో ఇస్మాయిల్ గాజా పట్టిని వీడి, ఖతర్‌లో ఉంటున్నారు. ఈ ఏప్రిల్ నెలలో ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో హనియా కుమారులు, మనవళ్లు, మనవరాళ్లు చనిపోయారని హమాస్ ప్రకటించింది. బుధవారం తెల్లవారుజామున జరిగిన దాడిలో హనియా మృతిచెందాడు. అతని సెక్యూరిటీ గార్డ్ కూడా చనిపోయాడు.


Read Latest
International News and Telugu News

Updated Date - Jul 31 , 2024 | 11:01 AM

Advertising
Advertising
<