ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

US Elections 2024: కమలాతో డిబేట్‌కు ట్రంప్ రెడీ.. ఆ తేదీన రచ్చ రచ్చే

ABN, Publish Date - Aug 28 , 2024 | 11:38 AM

అమెరికా అధ్యక్ష ఎన్నికల(US Elections 2024) ప్రచారం వాడీవేడీగా జరుగుతున్న వేళ.. అందరూ ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ఘట్టానికి వేదిక, సమయం ఫిక్స్అయింది.

న్యూయార్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికల(US Elections 2024) ప్రచారం వాడీవేడీగా జరుగుతున్న వేళ.. అందరూ ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ఘట్టానికి వేదిక, సమయం ఫిక్స్అయింది. రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్(Donald Trump), డెమొక్రాటిక్ ప్రత్యర్థి కమలా హారిస్‌(Kamala Harris)తో డిబేట్‌కు అంగీకరించారు. వీరిద్దరు సెప్టెంబర్ 10న చర్చలో పాల్గొనబోతున్నారు. ఈ మేరకు ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్‌లో ఒక పోస్ట్‌ను పంచుకున్నారు.

"కామ్రేడ్ కమలా హారిస్‌తో చర్చ కోసం రాడికల్ లెఫ్ట్ డెమొక్రాట్‌లతో నేను ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాను. ఫిలడెల్ఫియాలోని ABC న్యూస్‌లో మా డిబెట్ ప్రత్యక్ష ప్రసారం కానుంది" అని ట్రంప్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. ఓ వైపు వేదిక, తేదీ వివరాలు చెబుతూనే కమలాపై ట్రంప్ విరుచుకుపడ్డారు. ఆమెతో డిబేట్ చేయడానికి పలు షరతులు విధించారు.


వివాదం..

సీఎన్‌ఎన్‌లో జూన్ 27న జరిగిన చర్చలో పాటించిన నియమాలను అనుసరించడానికి తాను, కమలా హారిస్‌ ఒప్పందానికి వచ్చామని ట్రంప్‌ తెలిపారు. డిబెట్‌లో ప్రత్యక్ష ప్రేక్షకులు ఉండరని, అభ్యర్థులు మాట్లాడనప్పుడు వారి మైక్రోఫోన్లు మ్యూట్ చేసి ఉంటాయని చెప్పారు. హారిస్ అభ్యర్థిగా ఎంపికైన తర్వాత, ట్రంప్ ఆమెను సెప్టెంబర్ 4న ఫాక్స్ న్యూస్‌లో డిబేట్‌కి ఆహ్వానించారు. కానీ కమలా హారిస్ తిరస్కరించారు. తాజాగా ట్రంపే తేదీ, వేదిక చెప్పడంతో అమెరికా రాజకీయాలు రసవత్తరంగా మారాయి.

వాస్తవానికి తొలుత కమలా స్థానంలో ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ బరిలోకి దిగారు. వయస్సు పైబడటం, మతి మరుపు వల్ల ట్రంప్‌తో సమానంగా చర్చ చేయలేదు. దీంతో డెమోక్రాట్లు బైడెన్‌ను అధ్యక్ష ఎన్నిక బరి నుంచి తప్పుకోవాలని కోరారు. దాంతో బైడెన్ అధ్యక్ష ఎన్నిక నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.

For Latest News click here

Updated Date - Aug 28 , 2024 | 11:38 AM

Advertising
Advertising
<