Iranian Women Protest: మహిళలపై వికృత ఆంక్షలకు నిరసనగా గళమెత్తిన ఆ ఇరానీ యువతి ఆచూకీ గల్లంతు
ABN, Publish Date - Nov 04 , 2024 | 06:46 PM
యూనివర్శిటీలో నిరసన తెలిపిన యువతి ఆచూకీపై ఆమ్నేష్టి ఇంటర్నేషనల్ స్పందించింది. ఇరాన్ అధికారులు ఆ యువతని వెంటనే విడిచి పెట్టాలని డిమాండ్ చేసింది. ఆమెను మానసికంగా, శారీరకంగా హింసించకుండా అధికారులు నిరోధించాలని, తన కుటుంబ సభ్యులను, లాయర్‌ను కలుసుకునేందుకు ఆమెకు వీలు కల్పించాలని కోరింది.
టెహ్రాన్: మోరల్ పోలీసుల వేధింపులకు నిరసనగా టెహ్రాన్‌లోని ఇస్లామిక్ ఆజాద్ యూనివర్శిటీలో రెండ్రోజుల క్రితం ఓ యువతి హిజాబ్‌ను తొలగించి కేవలం లోదుస్తులతో సంచరించిన వీడియో సంచలనం సృష్టించగా, ఇప్పుడు ఆమె ఆచూకీ తెలియకుండా పోయింది. చిన్నచిన్న నేరాలకు సైతం కఠిన శిక్షలు అమలు చేస్తున్న ఇరాన్‌లో ఆమె పరిస్థితి ఇప్పుడేమిటంటూ అటు సోషల్ మీడియాలోనూ, ఇటు అమ్నెస్టీ ఇంటర్నేషనల్ నుంచి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
Canada: కెనడాలో భారతీయులపై అరాచకం.. రెచ్చిపోయిన ఖలిస్తానీ శక్తులు
ఇస్లామిక్ ఆజాద్ యూనివర్శిటీలో యువతి నిరసన వ్యక్తం చేస్తుండగా మఫ్టీలో ఉన్న వర్శిటీ పోలీసులు ఆమెను కారులోకి నెట్టి అజ్ఞాత ప్రాంతానికి తీసుకువెళ్లారు. అరెస్ట్ తర్వాత ఆమెను తీవ్రంగా కొట్టి, గాయపరిచరిచినట్టు ఇరాన్ వెలుపల పలు మీడియా సంస్థలు, సోషల్ మీడియా ఛానెల్స్ పోస్టులు పెడుతున్నాయి. నిరసనకు దిగిన విద్యార్థిని తన భర్తకు, ఇద్దరు పిల్లలకు దూరంగా ఉంటోందని, మతిస్థిమితం కోల్పోయిందని ఘటన అనంతరం ఆజాద్ యూనివర్శిటీ పబ్లిక్ రిలేషన్స్ అధికారి అమీర్ మహజాబ్ సోషల్ మీడియా పోస్ట్‌లో తెలిపారు. మానసిక చికిత్సాలయంలో ఆమెను చేర్చినట్టు ఒక స్థానిక వార్తాపత్రిక సైతం పేర్కొంది. అయితే రెండ్రోజుల తర్వాత ఆమె పరిస్థితి ఏమిటి? ఎక్కడుందనే వివరాలు తెలియకుండా పోయాయి.
తక్షణం విడుదల చేయండి: అమ్నెస్టీ
యూనివర్శిటీలో నిరసన తెలిపిన యువతి ఆచూకీపై ఆమ్నేష్టి ఇంటర్నేషనల్ స్పందించింది. ఇరాన్ అధికారులు ఆ యువతని వెంటనే విడిచి పెట్టాలని డిమాండ్ చేసింది. ఆమెను మానసికంగా, శారీరకంగా హింసించకుండా అధికారులు నిరోధించాలని, తన కుటుంబ సభ్యులను, లాయర్‌ను కలుసుకునేందుకు ఆమెకు వీలు కల్పించాలని కోరింది. అరెస్టు సమయంలో ఆమెను తీవ్రంగా కొట్టారని వస్తు్న్న ఆరోపణలపై స్వతంత్ర, నిష్పాక్షిక విచారణ జరిపించాలని అమ్నెస్నీ ఇంటర్నేషన్ స్పష్టం చేసింది.
ఇది కూడా చదవండి..
US Election 2024: అమెరికా ఎన్నికల్లో ఓటర్లు ఎటువైపు ఉన్నారంటే.. లేటెస్ట్ సర్వే ఇదే
Read More International News and Latest Telugu News
Updated Date - Nov 04 , 2024 | 07:01 PM