Joe Biden: అమెరికాను టచ్ చేస్తే ఇలాగే ఉంటుంది.. ఇరాన్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన జో బైడెన్
ABN, Publish Date - Feb 03 , 2024 | 11:27 AM
జోర్డాన్ (Jordan)లో అమెరికా (USA) సైనిక క్యాంప్‌పై ఇరాన్ సేనలు జరిపిన డ్రోన్ దాడికి సంబంధించి అగ్రరాజ్యం హెచ్చరికలు జారీ చేసింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మాట్లాడుతూ.. తాము ఎవరి జోలికి వెళ్లబోమని.. తమ జోలికి వస్తే ప్రతికార చర్యలు తప్పవని బైడెన్ హెచ్చరించారు.
న్యూయార్క్: జోర్డాన్ (Jordan)లో అమెరికా (USA) సైనిక క్యాంప్‌పై ఇరాన్ సేనలు జరిపిన డ్రోన్ దాడిని అగ్రరాజ్యం ఖండించింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మాట్లాడుతూ.. తాము ఎవరి జోలికి వెళ్లబోమని.. తమ జోలికి వస్తే ప్రతికార చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇరాన్ మద్దతు ఉన్న ఇరాక్, సిరియా భూభాగాల్లో యూఎస్ వైమానిక దళం ఇప్పటివరకు 80 లక్ష్యాలను చేధించింది. జనవరి 28న జోర్డాన్‌లోని యూఎస్ స్థావరాలపై ఇరాన్ డ్రోన్లతో దాడులు జరిపింది.
దీనికి ప్రతీకారంగా అమెరికా 125కుపైగా బాంబులతో 80 లక్ష్యాలపై విరుచుకుపడింది. ఈ దాడుల్లో ముగ్గురు మరణించినట్లు అధికారులు తెలిపారు. జోర్డాన్‌లో ముగ్గురు అమెరికా సైనికులను చంపినందుకు ప్రతీకారంగా ఈ దాడులు జరిపినట్లు బైడెన్ స్పష్టం చేశారు. "మధ్యప్రాచ్యం లేదా ప్రపంచంలో మరెక్కడైనా ఘర్షణలు జరగాలని మేం కోరుకోం. కానీ మాకు నష్టం కలిగించాలని చూసే వారు ఒక్క విషయం గుర్తించుకోవాలి. అమెరికాకు నష్టం కలిగించే ఏ పనినైనా అణచివేస్తాం. రానున్న రోజుల్లో మరిన్ని లక్ష్యాలపై దాడులు జరుపుతాం" అని బైడెన్ అన్నారు.
జోర్డాన్‌లో అమెరికా సైనిక క్యాంప్‌పై జరిగిన డ్రోన్ దాడిలో(Drone Attack) ముగ్గురు మరణించారు. దీనిపై ఆగ్రహంగా ఉన్న అమెరికా బీ - 1 బాంబర్లతో విరుచుకుపడింది. ఈ దాడులు ఇరాక్ సరిహద్దు ప్రాంతాలను కూడా తాకాయి. దీంతో సిరియా, ఇరాక్‌లలో 18 మందికిపైగా మరణించినట్లు అధికారులు వెల్లడించారు.
ఖండించిన ఇరాన్..
అమెరికా దాడుల్ని ఇరాన్ మిలిటరీ తీవ్రంగా ఖండించింది. యూఎస్ దాడులు చేయడం అంటే తమ దేశ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించడమేనని పేర్కొంది. వివాదంపై అమెరికా స్పందిస్తూ.. దాడుల విషయాన్ని ఇరాక్ ప్రభుత్వానికి ముందుగానే చెప్పినట్లు తెలిపింది. సమాచారం ఇచ్చాకే వారి భూభాగంలో దాడులు జరిపినట్లు వివరించింది.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Updated Date - Feb 03 , 2024 | 11:40 AM