ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Vivek Ramaswamy: అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి తప్పుకున్న వివేక్ రామస్వామి

ABN, Publish Date - Jan 16 , 2024 | 11:48 AM

భారత సంతతి వ్యక్తి వివేక్ రామస్వామి అమెరికా అధ్యక్ష రేసు నుంచి వైదొలిగారు. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఆయన మద్ధతు ప్రకటించారు. 2024 అమెరికా అధ్యక్ష ప్రాథమిక ఎన్నికల్లో భాగంగా అయోవా రాష్ట్రం రిపబ్లికన్ పార్టీ నామినేషన్ ప్రక్రియలో పేలవ రీతిలో వెనుకబడడంతో రామస్వామి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఫిబ్రవరి 2023లో ఆయన అధ్యక్ష ఎన్నికల రేసులోకి దూసుకొచ్చి హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే.

వాషింగ్టన్: భారత సంతతి వ్యక్తి వివేక్ రామస్వామి అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి వైదొలిగారు. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఆయన మద్ధతు ప్రకటించారు. 2024 అమెరికా అధ్యక్ష ప్రాథమిక ఎన్నికల్లో భాగంగా అయోవా రాష్ట్రం నుంచి ప్రెసిడెన్షియల్ నామినేషన్ కోసం రిపబ్లికన్ పార్టీ నిర్వహించిన ఎన్నికల ప్రక్రియలో పేలవ రీతిలో వెనుకబడడంతో రామస్వామి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఫిబ్రవరి 2023లో ఆయన అధ్యక్ష ఎన్నికల రేసులోకి దూసుకొచ్చి హాట్ టాపిక్‌గా మారారు. ఇమ్మిగ్రేషన్‌, ‘అమెరికా ఫస్ట్’ నినాదాలతో ఆయన ఆకర్షించారు. తన బలమైన అభిప్రాయాలతో మొదట్లో చాలామందిని ఆకట్టుకున్నారు. ప్రెసిడెన్షియల్ రేసులో రిపబ్లికన్ ఓటర్లలో దృష్టిని ఆకర్షించగలిగారు. అయితే రామస్వామి ప్రచార వ్యూహం, విధానాలు మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నినాదాలకు దగ్గరగా ఉండడం మైనస్ అయ్యింది. దానికి తోడు రామస్వామిపై ట్రంప్ బహిరంగంగానే విరుచుకుపడుతూ వచ్చారు. ఒహియో స్థానికుడైన వివేక్ రామస్వామి కేరళ నుంచి వలస అమెరికాకు వలస వెళ్లిన తల్లిదండ్రులకు జన్మించాడు. అధ్యక్ష ఎన్నికల రేసులో నిలిచి ప్రధాన పోటీదారుల్లో ఒకరిగా నిలిచిన విషయం తెలిసిందే.


అయోవాలో ట్రంప్‌కు భారీ మెజారిటీ..

వివేక్ రామస్వామి దారుణంగా విఫలమైన అయోవా రాష్ట్రం రిపబ్లికన్ కాకస్‌లో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఘనవిజయం సాధించారు. దీంతో రిపబ్లికన్ ప్రెసిడెన్షియల్ నామినేషన్ ప్రక్రియలో ఆయన తన స్థానాన్ని మరింత పటిష్ఠం చేసుకున్నారు. అయోవా ఓటింగ్‌ను బట్టి చూస్తే రామస్వామికి అంత సానుకూలత లేదని స్పష్టమవుతోంది. రామస్వామిని డొనాల్డ్ ట్రంప్ బహిరంగంగా వ్యతిరేకించారు. ‘మోసం’ అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేయించారు. దీంతో భారతీయ-అమెరికన్‌ అయిన వివేక్ రామస్వామికి ఆదరణ తగ్గిపోయింది. అయోవాలో రామస్వామికి 7.7 శాతం ఓట్లు రావడంతో ఆయన నాలుగవ స్థానంలో నిలిచారు.

Updated Date - Jan 16 , 2024 | 11:57 AM

Advertising
Advertising