ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

H-4 Visa: హెచ్-4 వీసాదారులకు అమెరికా గుడ్ న్యూస్.. ఆ బిల్లుకి ఆమోదం

ABN, Publish Date - Feb 05 , 2024 | 03:43 PM

హెచ్-4 వీసాదారులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ఆ సమయం రానే వచ్చేసింది. వారికి ఊరటనిచ్చే ఒక శుభవార్తను అమెరికా ప్రకటించింది. త్వరలోనే వర్క్ ఆథరైజేషన్ బిల్లుకు ‘సెనెట్’ ఆమోదం తెలపనున్నట్టు పేర్కొంది. దీంతో.. సుమారు లక్ష మంది భారతీయులకు లబ్ది చేకూరుతుంది.

హెచ్-4 వీసాదారులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ఆ సమయం రానే వచ్చేసింది. వారికి ఊరటనిచ్చే ఒక శుభవార్తను అమెరికా ప్రకటించింది. త్వరలోనే వర్క్ ఆథరైజేషన్ బిల్లుకు ‘సెనెట్’ ఆమోదం తెలపనున్నట్టు పేర్కొంది. దీంతో.. సుమారు లక్ష మంది భారతీయులకు లబ్ది చేకూరుతుంది. ఈ విషయంపై ఆదివారం అమెరికన్‌ సెనెట్‌లో రిపబ్లికన్స్, డెమోక్రాట్స్ మధ్య సుదీర్ఘ చర్చ సాగింది. ఫైనల్‌గా ఈ చర్చల్లో భాగంగా.. ‘జాతీయ భద్రతా ఒప్పందానికి’ ఆమోదం తెలిపేందుకు ఇరు వర్గాలు తమ అంగీకారం తెలిపాయి.


ఇంతకీ హెచ్-4 వీసా ఏంటి?

హెచ్-1బీ వీసా కలిగిన వారి కుటుంబ సభ్యులకు (భాగస్వామ్యులు, 21 ఏళ్లలోపు వయసున్న పిల్లలు) అమెరికాలో ఉద్యోగం చేసుకోవడానికి వీలుగా హెచ్-4 వీసాలు జారీ చేయడం జరుగుతుంది. అయితే.. ఇది అంత సులువైన ప్రక్రియ కాదు. ముందుగా ఈ వీసా కలిగిన వాళ్లు ‘ఎంప్లాయిమెంట్‌ ఆథరైజేషన్‌ డాక్యుమెంట్‌’ (EAD), ‘ఐ-765’ కోసం తప్పకుండా దరఖాస్తు చేసుకోవాలి. ఈ ప్రక్రియ మొత్తం పూర్తయ్యి.. ఆథరైజేషన్ వస్తేనే ఆ అగ్రరాజ్యంలో ఉద్యోగం చేసుకోవడానికి అవకాశం లభిస్తుంది. అయితే.. ఈ మొత్తం ప్రాసెస్ పూర్తవ్వడానికి ఏకంగా ఏడాది సమయం పడుతుంది. ఈ దెబ్బకు.. హెచ్-4 వీసాదారులు తమ ఉద్యోగ అవకాశాల్ని కోల్పోవాల్సి వస్తోంది.

ఈ అంశంపై అభ్యంతరాలు వ్యక్తమైన తరుణంలో.. ప్రస్తుతం ఉన్న నిబంధనలను మార్చారు. ‘ఆటోమెటిక్ వర్క్ ఆథరైజేషన్’ కల్పించేలా ఒక కొత్త బిల్లును రూపొందించారు. ఈ బిల్లుకు త్వరలోనే ఆమోదం తెలపనున్నట్లు వైట్‌హౌట్‌ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మాట్లాడుతూ.. ‘‘కొన్ని దశాబ్దాల వెనక్కు వెళ్లి చూస్తే, ఇమ్మిగ్రేషన్ వ్యవస్థ విచ్ఛిన్నమైంది. ఇప్పుడు దానిని సరిచేసే సమయం ఆసన్నమైంది. కొత్తగా తీసుకొస్తున్న ఈ బిల్లు అమెరికాను బలోపేతం చేయడంతో పాటు సరిహద్దులను సురక్షితం చేస్తుంది. అమెరికాకు అనుగుణంగా.. చట్టబద్ధంగా వలసలకు అవకాశం కల్పిస్తుంది’’ అని చెప్పుకొచ్చారు.

ట్రంప్ ఆంక్షలు

నిజానికి.. బరాక్ ఒబామా అమెరికా అధ్యక్షుడిగా ఉన్నన్నపుడు 2015లోనే హెచ్-4 వీసాదారులకు ఉద్యోగాలు చేసుకోవడానికి అవకాశాలు కల్పించారు. కానీ.. ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత దీనిపై ఆంక్షలు విధించారు. ఆ దెబ్బకు ఎంతోమంది భారతీయులు తమ ఉద్యోగవకాశాల్ని కోల్పోయారు. ఇప్పుడు ఈ ఆంక్షల్ని ఎత్తివేస్తూ.. బైడెన్ ప్రభుత్వం కొత్త బిల్లుని తీసుకొచ్చింది. ఈ కొత్త విధానం ద్వారా.. హెచ్‌-4 వీసాదారులకు తమ జీవిత భాగస్వామి పనిచేసే ప్రాంతంలోనే ఉద్యోగం చేసే అవకాశం లభిస్తుందని వైట్‌హౌస్‌ వెల్లడించింది.

Updated Date - Feb 05 , 2024 | 03:43 PM

Advertising
Advertising