ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hassan Nasrallah: హసన్ నస్రల్లా ఎవరు.. ఇజ్రాయెల్‌ అంటే భయమెందుకు

ABN, Publish Date - Sep 28 , 2024 | 04:29 PM

లెబనాన్ (Lebanon) రాజధాని బీరుట్‌ (Beirut)లోని హిజ్బుల్లా ప్రధాన కార్యాలయంపై ఇజ్రాయెల్ జరిపిన బాంబు దాడుల్లో హిజ్బుల్లా (HeZbollah)అధిపతి హసన్ నస్రల్లా మరణించినట్టు ఇజ్రాయెల్ రక్షణ శాఖ ధ్రువీకరించింది. ఇంతకి నస్రల్లా ఎవరు..

బీరుట్: లెబనాన్ (Lebanon) రాజధాని బీరుట్‌ (Beirut)లోని హిజ్బుల్లా ప్రధాన కార్యాలయంపై ఇజ్రాయెల్ జరిపిన బాంబు దాడుల్లో హిజ్బుల్లా (HeZbollah)అధిపతి హసన్ నస్రల్లా మరణించినట్టు ఇజ్రాయెల్ రక్షణ శాఖ ధ్రువీకరించింది. నస్రల్లా ఇక ఎంతమాత్రం ఈ ప్రంపచాన్ని ఉగ్రవాదంతో భయభ్రాంతులకు గురిచేయలేడంటూ 'ఎక్స్' ఖాతాలో పోస్ట్ చేసింది. 'ఆపరేషన్ న్యూ ఆర్డన్ మిషన్' విజయవంతమైనట్టు ఇజ్రాయెల్ వార్ రూమ్ సైతం ప్రకటించింది. అయితే, హిజ్బుల్లా మిలిటెంట్ గ్రూప్ మాత్రం ఇజ్రాయెల్ బాంబు దాడుల్లో తమ నాయకుడు నస్రల్లా మరణించాడన్న వార్తలను ధ్రువీకరించలేదు. శుక్రవారం రాత్రి నుంచి ఆయన తమ కాంటాక్ట్‌లో లేరని, ఆయన ఎక్కడున్నారనేది కానీ, ఆరోగ్య పరిస్థితి కానీ తమకు తెలియదని ఆ వర్గాలు పేర్కొన్నాయి.

అప్రమత్తమైన ఇరాన్..

హెజ్బొల్లా చీఫ్ నస్రల్లా(Hassan Nasrallah) మృతితో ఇరాన్ జాగ్రత్తపడుతోంది. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని కట్టుదిట్టమైన భద్రత మధ్య సురక్షిత ప్రాంతానికి తరలించినట్టు తెలుస్తోంది. నస్రుల్లా మృతిపై ఇరాన్ సెక్యూరిటీ కౌన్సిల్తో ఖమేనీ సమావేశమైనట్టు అంతర్జాతీయ మీడియా తెలిపింది. అలాగే తదుపరి క్యాచరణపై హెజ్బొల్లా, ప్రాంతీయ గ్రూప్‌లతో ఇరాన్ చర్చలు జరుపుతున్నట్టు కథనాలు వస్తున్నాయి.


హసన్ నస్రల్లా ఎవరు?

షేక్ హసన్ నస్రల్లా 1992 నుంచి హిజ్బుల్లాకు నాయకత్వం వహిస్తున్న షియా మత గురువు. హిజ్బుల్లా రాజకీయంగా, సైనిక దళంగా మార్చడంలో ఆయన ప్రముఖ పాత్ర వహించారు. ఇరాన్‌తోపాటు ఆ దేశ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీతో నస్రల్లాకు సన్నిహిత సంబంధాలున్నాయి. 1981లో ఇరాన్ మొదటి సుప్రీం లీడర్ ఆయనను లెబనాన్‌లో తన వ్యక్తిగత ప్రతినిధిగా నియమించిన నాటి నుంచి ఈ సంబంధాలు బలపడ్డాయి. ఇజ్రాయెల్ తనను చంపేస్తుందనే భయంతో నస్రల్లా కొన్నేళ్లుగా బాహ్యప్రపంచానికి దూరంగా ఉన్నారు. అయితే హిజ్బుల్లాలో అందరూ ఆయన్ని గౌరవంగా చూస్తారు. ప్రతి ఆదివారం ఓ ప్రముఖ టీవీ ఛానల్‌లో ప్రసంగిస్తారు.

హిజ్బుల్లా అంటే..

ఇజ్రాయెల్, హిజ్బుల్లా వైరం ఇప్పటిది కాదు. హిజ్బుల్లా అనేది షియా ముస్లిం సంస్థ. లెబనాన్‌లో రాజకీయంగా చాలా ప్రభావవంతమైనది. లెబనాన్‌లో అత్యంత శక్తిమంతమైన సాయుధ దళం దీని నియంత్రణలో ఉంది. 1980లలో ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా ఇరాన్ దీన్ని స్థాపించింది.1992 నుంచి లెబనాన్ జాతీయ ఎన్నికలలో పాల్గొంటూ, ప్రధాన రాజకీయ శక్తిగా హిజ్జుల్లా మారింది. ఒకప్పుడు లెబనాన్ అంతర్యుద్ధం సమయంలో ఇజ్రాయెల్ దళాలు దక్షిణ లెబనాన్‌ను ఆక్రమించాయి.


దాని సాయుధ విభాగం లెబనాన్‌లోని ఇజ్రాయెల్, అమెరికా దళాలపై హిజ్బుల్లా తీవ్రమైన దాడులు చేసేది. 2000 ఏడాదిలో లెబనాన్ నుంచి ఇజ్రాయెల్ వైదొలిగినప్పుడు, తామే వారిని తరిమి కొట్టామని హిజ్బుల్లా ప్రకటించింది. అప్పటి నుంచి హిజ్బుల్లా దక్షిణ లెబనాన్‌లో వేలాది మంది ఫైటర్లు, క్షిపణులతో సహా అనేక రకాల ఆయుధాలను సమకూర్చుకుంటూ, వివాదాస్పద సరిహద్దు ప్రాంతాల్లో ఇజ్రాయెల్ ఉనికిపై నిఘా ఉంచుతూ వచ్చింది. అయితే ఇజ్రాయెల్, అరబ్ దేశాలతో సహా కొన్ని పాశ్చాత్య దేశాలు హిజ్బుల్లాను ఉగ్రవాద సంస్థగా గుర్తించాయి.


ఇజ్రాయెల్‌తో యుద్ధం..

ఇజ్రాయెల్ ఉనికిని తొలి నుంచి వ్యతిరేకిస్తూ వచ్చిన హిజ్బుల్లా 2006లో ఇజ్రాయెల్‌తో పూర్తిస్థాయిలో తలపడింది. ప్రపంచంలోని అత్యంత శక్తిమంతమైన సాయుధ దళాలలో హిజ్బుల్లా ఒకటి. దీనికి నిధులు, ఆయుధాలను ఇరాన్ సమకూరుస్తోంది. సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ ప్రకారం.. హిజ్బుల్లా వద్ద లక్ష 20 వేల నుంచి 2 లక్షల వరకు రాకెట్లు, క్షిపణులు ఉన్నాయని అంచనా. షేక్ హసన్ నస్రల్లా తమ వద్ద లక్ష మంది ఫైటర్లు ఉన్నారని చెబుతుంటారు. కానీ వాస్తవంగా 50 వేలలోపు ఉండొచ్చని ఓ అంచనా. వీరిలో చాలా మంది సాయుధ శిక్షణ పొందారు. సిరియా అంతర్యుద్ధంలో పోరాడిన వాళ్లు కూడా ఈ ఫైటర్లలో ఉన్నట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది.

Rain Alert: నేడు ఈ ప్రాంతాల్లో మళ్లీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరికలు జారీ

Indian Railways: పండుగల రద్దీ దృష్ట్యా 6 వేల ప్రత్యేక రైళ్లు
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read More Latest Telugu News Click Here

Updated Date - Sep 28 , 2024 | 06:21 PM