ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ISIS: చిన్నారులను చంపి, కూరగా వండి.. ఐసిస్ దురాగతాలు

ABN, Publish Date - Oct 20 , 2024 | 03:06 PM

ఐసిస్ ఉగ్రవాద సంస్థ దురాగతాలు ఒక్కొక్కటిగా బయటకి వస్తున్నాయి. ఐసిస్(ISIS) చేతిలో బందీలుగా మారిన శిశువులను చంపి వారి మాంసంతో కూర వండేవారట. అనంతరం ఆ కూరను అక్కడ బందీలుగా ఉన్న వారికి వడ్డించేవారట.

ఇంటర్నెట్ డెస్క్: ఐసిస్ ఉగ్రవాద సంస్థ దురాగతాలు ఒక్కొక్కటిగా బయటకి వస్తున్నాయి. ఐసిస్(ISIS) చేతిలో బందీలుగా మారిన శిశువులను చంపి వారి మాంసంతో కూర వండేవారట. అనంతరం ఆ కూరను అక్కడ బందీలుగా ఉన్న వారికి వడ్డించేవారట. ఈ విషయాన్ని ఐసిస్ చేతిలో బందీగా మారి 10 ఏళ్లు నరకయాతన అనుభవించిన ఓ మహిళ చెప్పింది. ఐసిస్ అపహరించిన ఫౌజియా అమీన్ సిడో అనే మహిళను లెబనాన్‌లో గుర్తించిన ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) ఆమెను రక్షించి కుటుంబానికి అప్పగించింది. ఆమె పదేళ్ల పాటు ఐసిస్‌ చేతిలో బందీగా ఉంది. ఇటీవలే ఆమె ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ ఐసిస్‌లో తాను ఎదుర్కొన్న భయంకర అనుభవాలను వెల్లడించింది. ఐసిస్‌లో బందీగా ఉన్న సమయంలో అక్కడి వారు యజిదీ(Yazidi) శిశువులను హత్యచేసి వండి పెట్టేవారని విలపించింది. 2014లో 200 మంది మహిళలు, పిల్లలను బానిసలుగా చేసుకుందని.. వారిలోనే తానూ, తన సోదరులు ఉన్నట్లు చెప్పింది. అప్పుడు ఆమె వయస్సు 9 ఏళ్లు.


‘‘టెర్రరిస్టులు మమ్మల్ని బంధించిన అనంతరం మూడు రోజుల పాటు ఆహారం పెట్టలేదు. తర్వాత మాకు అన్నం, మాంసం పెట్టారు. మాంసాహారం తింటున్న సమయంలో దుర్వాసన వచ్చింది. ఆహారం తిన్న వెంటనే అనారోగ్యం బారిన పడ్డాం. ఆ మాంసం జంతువుది కాదని చెప్పడంతో షాక్‌కి గురయ్యాం. యజిదీ శిశువులను చంపి కూర వండి మాకు వడ్డించారు. చిన్నారులను చంపి.. వండుతున్నప్పుడు తీసిన ఫొటోలను చూపించారు. మా పిల్లలను మేమే తిన్నామనే ఆలోచన మమ్మల్ని నిలువునా దహించివేసింది. ఓ మహిళ కనిపించకుండా పోయిన తన బిడ్డలను గుర్తు చేసుకొని క్షణాల్లోనే ప్రాణాలు విడిచింది’’ అని ఫౌజియా మీడియాతో చెప్పారు.


విలవిల్లాడిన చిన్నారులు..

బాధితురాలు చిన్నారులు పడిన బాధల గురించి వివరించింది. ఉగ్రవాదులు తమను భూగర్భ జైలులో తొమ్మిది నెలల పాటు బందీగా ఉంచారని తెలిపింది. కలుషిత తాగునీరు ఇవ్వడంతో చాలా మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారని వెల్లడించింది. తరువాత తన పేరును సబయాగా మార్చి జిహాదీలకు విక్రయించారని తెలిపింది. ఐసిస్ చేతిలో ప్రస్తుతం తన ఇద్దరు పిల్లలు బందీలుగా ఉన్నారని ఆవేదన వ్యక్తం చేసింది. అక్కడ వారు అరబ్‌ ముస్లింలుగా పెరుగుతున్నారని చెప్పింది.

ఈ వార్తలు కూడా చదవండి

ABN Effect: ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వరస కథనాలతో HMDA అధికారుల్లో కదలిక..

Group-1 Exam: మరోసారి రోడ్డెక్కిన గ్రూప్-1 బాధితులు.. అశోక్‌నగర్‌లో ఉద్రిక్తత..

HYDRA: హైడ్రా చీఫ్ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు

For Telangana News And Telugu News...

Updated Date - Oct 20 , 2024 | 03:06 PM