ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

YouTube: సుసాన్ వోజ్‌కికీ కన్నుమూత

ABN, Publish Date - Aug 10 , 2024 | 02:03 PM

యూట్యూబ్ మాజీ సీఈవో సుసాన్ వోజ్‌‌కికీ అనారోగ్యంతో కన్నుమూశారు. రెండేళ్ల నుంచి ఆమె క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. యూట్యూబ్‌కు పాపులారిటీ తీసుకొచ్చేందుకు సుసాన్ కృషి చేశారు. సుసాన్ కన్నుమూశారని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

YouTube Ex-CEO Susan Wojcicki

యూట్యూబ్ మాజీ సీఈవో సుసాన్ వోజ్‌‌కికీ (YouTube Ex-CEO Susan Wojcicki) అనారోగ్యంతో కన్నుమూశారు. రెండేళ్ల నుంచి ఆమె క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. యూట్యూబ్‌కు పాపులారిటీ తీసుకొచ్చేందుకు సుసాన్ కృషి చేశారు. సుసాన్ కన్నుమూశారని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.


పోరాడి ఓడింది..

‘క్యాన్సర్ వ్యాధితో సుసాన్ వోజ్‌కికీ పోరాడి ఓడింది. గత రెండేళ్ల నుంచి అనారోగ్య సమస్యలతో తల్లడిల్లింది. సుసాన్ మృతి తీవ్ర వేదనకు గురిచేసింది. గూగుల్‌ కంపెనీ చరిత్రలో సుసాన్‌కు ప్రత్యేక స్థానం ఉంది. ఆమె ఇక లేరనే మాటను జీర్ణించుకోలేక పోతున్నాం. ప్రపంచంపై అద్భుతమైన ప్రభావం చూపిన గొప్ప వ్యక్తి సుసాన్, ఆమె గొప్ప నాయకురాలు. అంతకుమించి మంచి స్నేహితురాలు. ఆమె గురించి తెలుసుకునేందుకు అన్వేషించిన వారిలో నేను ఒకడిని. సుసాన్ మృతి నన్ను తీవ్రంగా కలచివేసింది. సుసాన్ కుటుంబానికి అండగా నిలువాల్సి ఉంది అని’ పిచాయ్ పేర్కొన్నారు.


గూగుల్‌లో విధులు..

సుసాన్ గూగుల్ కంపెనీలో పనిచేశారు. యాడ్ సెన్స్ రూపొందించినందుకు గూగుల్ ఫౌండర్స్ అవార్డు వరించింది. తర్వాత యూట్యూబ్‌ సీఈవోగా బాధ్యతలు చేపట్టారు. యూట్యూబ్‌ను గ్లోబల్ పవర్ హౌస్‌గా అభివృద్ధి చేశారు. ఆమె సీఈవోగా ఉన్న సమయంలోనే మిలియన్ల కంటెంట్ పోస్ట్ అయ్యింది. వీక్షకుల సంఖ్య బిలియన్లకు చేరుకుంది. సాంకేతిక రంగంలో సుసాన్ మంచి పేరు తెచ్చుకున్నారు. మిగతా మహిళ ఉద్యోగులకు ఆదర్శంగా నిలిచారు. సుసాన్ యూట్యూబ్ నుంచి వైదొలిగిన తర్వాత.. భారత సంతతికి చెందిన నీల్ మోహన్ బాధ్యతలు స్వీకరించారు.

Updated Date - Aug 10 , 2024 | 02:03 PM

Advertising
Advertising
<