Kolkata: కోల్‌కతాలో ఘోరం.. కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న భవనం.. భారీగా ప్రాణ నష్టం!
ABN, Publish Date - Mar 18 , 2024 | 09:15 AM
కోల్‌కతాలో(Kolkata) ఘోరం జరిగింది. ఆదివారం అర్థరాత్రి నిర్మాణంలో ఉన్న ఓ భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో భారీగా ప్రాణ నష్టం జరిగినట్లు తెలుస్తోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గార్డెన్ రీచ్ ప్రాంతంలోని హజారీ మొల్లా బగన్‌లో అర్ధరాత్రి ఐదంతస్తుల భవనం కుప్పకూలింది.
కోల్‌కతా: కోల్‌కతాలో(Kolkata) ఘోరం జరిగింది. ఆదివారం అర్థరాత్రి నిర్మాణంలో ఉన్న ఓ భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో భారీగా ప్రాణ నష్టం జరిగినట్లు తెలుస్తోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గార్డెన్ రీచ్ ప్రాంతంలోని హజారీ మొల్లా బగన్‌లో అర్ధరాత్రి ఐదంతస్తుల భవనం కుప్పకూలింది. అలజడి గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు అధికారులు రంగంలోకి దిగారు. భవన శిథిలాలు చుట్టుపక్కల ఇళ్లపై పడటంతో భారీగా ప్రాణ నష్టం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఉదయం 5 గంటలవరకు 10 మందిని రక్షించినట్లు అధికారులు తెలిపారు. మిగతావారిని రక్షించేందుకు సహాయక చర్యలు ముమ్మరం చేశామన్నారు.
కోల్‌కతా పోలీస్ కమిషనర్ వినీత్ గోయల్ ఘటనా స్థలాన్ని సందర్శించి సహాయక చర్యలను పరిశీలించారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలిస్తున్నట్లు చెప్పారు. భవన శిథిలాలు పక్కనే ఉన్న గుడిసెలపై సైతం పడ్డాయని.. ఆ సమయంలో గుడిసెల్లో ఎంతమంది ఉన్నారో తెలియరాలేదని తెలిపారు. ఇంకా చాలా మంది శిథిలాల కింద చిక్కుకుని ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
Updated Date - Mar 18 , 2024 | 09:15 AM