Orphanage: ఇండోర్‌లో దారుణం.. అనాథాశ్రమ చిన్నారులకు చిత్రహింసలు
ABN, Publish Date - Jan 19 , 2024 | 05:48 PM
అనాథశ్రమంలో పిల్లలకు చిత్రహింసలు పెట్టిన ఘటన మధ్యప్రదేశ్‌లో సంచలనం సృష్టిస్తోంది. తాజాగా ఓ అనాథాశ్రమాన్ని(Indore Orphanage) తనిఖీలో భయంకర విషయాలు వెలుగు చూశాయి. ఇండోర్‌లోని వాత్సల్యాపురం ప్రాంతంలో జైన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఓ అనాథాశ్రమం నడుస్తోంది. దీనిని గతవారం శిశు సంక్షేమ కమిటీ బృందం తనిఖీ చేసింది. ఈ తనిఖీల్లో విస్తుపోయే విషయాలు బయటకి వచ్చాయి.
ఇండోర్: అనాథశ్రమంలో పిల్లలకు చిత్రహింసలు పెట్టిన ఘటన మధ్యప్రదేశ్‌లో సంచలనం సృష్టిస్తోంది. తాజాగా ఓ అనాథాశ్రమాన్ని(Indore Orphanage) తనిఖీలో భయంకర విషయాలు వెలుగు చూశాయి. ఇండోర్‌లోని వాత్సల్యాపురం ప్రాంతంలో జైన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఓ అనాథాశ్రమం నడుస్తోంది. దీనిని గతవారం శిశు సంక్షేమ కమిటీ బృందం తనిఖీ చేసింది. ఈ తనిఖీల్లో విస్తుపోయే విషయాలు బయటకి వచ్చాయి. అనాథాశ్రమంలో పని చేస్తున్న సిబ్బంది 21 మంది చిన్నారులను చిత్రహింసలకు గురి చేసినట్లుగా అధికారులు గుర్తించారు. పిల్లలను విచారించగా.. చిన్న తప్పులకు దారుణంగా కొట్టేవారని తెలిపారు. బట్టలు విప్పించి తలకిందులుగా వేలాడదీసి వాతలు పెట్టినట్లు చిన్నారులు ఏడుస్తూ చెప్పారు.
వారి శరీరంపై వాతలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మరికొంత మంది సిబ్బంది ఎండుమిరపకాయలను కాల్చి పొగ పీల్చమని చిన్నారులను బలవంతం చేసేవారు. ప్యాంట్‌లో మలవిసర్జన చేసుకున్న బాలుడికి రెండు రోజులు ఆహారం ఇవ్వకుండా వాష్ రూంలో బంధించారు. తమను హింసించిన విధానాలను చిన్నారులు ఒక్కొక్కటిగా చెబుతుండగా అధికారులు విస్తుపోయారు. చిన్నారుల ఫిర్యాదు మేరకు అధికారులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న అనాథాశ్రమాన్ని మూసేయించారు. అందులో పని చేస్తున్న 5 మంది సిబ్బందిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. అందులోని మహారాష్ట్ర, ఒడిశా, రాజస్థాన్, మధ్యప్రదేశ్ కి చెందిన అనాథ పిల్లలను ప్రభుత్వ వసతి గృహాలకు పంపించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Updated Date - Jan 19 , 2024 | 05:48 PM