Raipur: భద్రతా సిబ్బందితో తలపడ్డ నక్సలెట్లు.. భీకర పోరులో ముగ్గురు హతం
ABN, Publish Date - Feb 25 , 2024 | 08:14 PM
ఛత్తీస్‌గఢ్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్లో ముగ్గురు నక్సలైట్లు(Naxalites) మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. వీరు భద్రతా బలగాలతో తలపడ్డట్లు తెలుస్తోంది.
రాయ్‌పుర్: ఛత్తీస్‌గఢ్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్లో ముగ్గురు నక్సలైట్లు(Naxalites) మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. వీరు భద్రతా బలగాలతో తలపడ్డట్లు తెలుస్తోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాంకేర్ జిల్లాలోని కోయలిబెడ పోలీస్ స్టేషన్ పరిధిలో భోమ్రా - హుర్తరాయ్ గ్రామాల మధ్య కొండపై ఆదివారం ఉదయం 8 గంటలకు భద్రతా బలగాలు, నక్సలైట్లకు ఎదురుకాల్పులు జరిగాయి.
తుపాకుల మోతతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. పరస్పర కాల్పుల్లో ముగ్గురు నక్సలైట్లు మరణించారు. వారి ఉనికిని గుర్తించిన జిల్లా రిజర్వ్ గార్డ్, సరిహద్దు భద్రతా దళం(BSF) 30వ బెటాలియన్ జాయింట్ స్వ్కాడ్‌ను శనివారం రాత్రే ఆ ప్రాంతంలో మోహరించింది. ఎదురుకాల్పుల్లో ముగ్గురు హతం కావడంతో మిగిలిన నక్సలైట్లు అక్కడి నుంచి పారిపోయారు. ఘటనా స్థలం నుంచి మృతదేహాలు, కొన్ని తుపాకులు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మందుగుండు సామగ్రి కూడా లభించిందన్నారు. హతుల వివరాలు తెలియాల్సి ఉంది.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Updated Date - Feb 25 , 2024 | 08:15 PM