ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Ram Mandir: రాముడి ప్రాణ ప్రతిష్ఠ వేళ.. ఈ 6 మంత్రాలు జపించండి

ABN, Publish Date - Jan 21 , 2024 | 12:03 PM

అయోధ్యలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి సర్వం సిద్ధమయింది. జనవరి 22న ప్రధాని మోదీ సమక్షంలో ఈ కార్యక్రమం జరగనుంది. దేశంలోని అనేక గ్రామాలు, పట్టణాలు, నగరాలు రామనామ స్మరణతో మార్మోగుతున్నాయి. రాముడిని ధర్మానికి, కరుణకు, కర్తవ్యానికి ప్రతిరూపంగా కొలుస్తారు. విష్ణువు ఏడో అవతారంగా నమ్ముతారు.

అయోధ్య: అయోధ్యలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి సర్వం సిద్ధమయింది. జనవరి 22న ప్రధాని మోదీ సమక్షంలో ఈ కార్యక్రమం జరగనుంది. దేశంలోని అనేక గ్రామాలు, పట్టణాలు, నగరాలు రామనామ స్మరణతో మార్మోగుతున్నాయి. రాముడిని ధర్మానికి, కరుణకు, కర్తవ్యానికి ప్రతిరూపంగా కొలుస్తారు. విష్ణువు ఏడో అవతారంగా నమ్ముతారు. స్వామి నిబద్ధత, ధర్మంవైపు నిలిచిన విధానం సమాజానికి ఎంతో ఆదర్శప్రాయం. అతన్ని పూజిస్తే ఎనలేని ధైర్యం వస్తుందని.. కష్టాలన్నీ తీరిపోతాయని భక్తుల నమ్మకం. రామచంద్రుడి పూజా కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు ఈ 6 మంత్రాలు పఠించండి.

రామ్...

రాముడిని పూజించేందుకు అత్యంత శక్తివంతమైన మంత్రం 'రామ్' నామ మంత్రం. 'రామ్' అనే పేరును ఉచ్ఛరించడం వల్ల మనుషుల్లో మంచి పరివర్తన వస్తుందని భక్తులు నమ్ముతారు. ఈ పేరు దైవిక శక్తిని సూచిస్తుంది. భక్తితో ఈ మంత్రాన్ని పఠిస్తే మీ మనస్సు, ఆత్మ శుద్ధి అవుతుంది. చైతన్యాన్ని మేల్కొలుపుతుంది. జీవితంలో శాంతి, సామరస్యాన్ని పెంపొందిస్తుంది. ఈ పదం సరళంగా ఉంటుంది. అందువల్ల రోజువారీ అభ్యాసానికి ఇది అనువైన మంత్రం.

రక్షణ మంత్రం - శ్రీ రామ శరణం మమ్

రాముడికి అంకితం చేసిన ఈ మంత్రానికి 'నేను రాముడిని శరణు వేడుతున్నాను' అనే అర్థం వస్తుంది. ఈ మంత్రాన్ని పఠించడం అంటే రాముడ్ని రక్షించమని ప్రార్థించినట్లు. ఈ మంత్రాన్ని జపిస్తే భక్తులకు ఉన్న ప్రతికూలతలు, సమస్యలు, అడ్డంకులు తొలగిపోతాయిని భక్తుల నమ్మకం. జీవితంలో ప్రశాంతత కరవైనప్పుడు రక్షణ మంత్రాన్ని జపించాలి.

బీజ్ మంత్రం - ఓం రాం రామాయ నమః..

బీజ్ మంత్రం లేదా విత్తన మంత్రం.. కష్టాల్లో సానుకూల, బలమైన ప్రభావాన్ని చూపిస్తుంది. అత్యంత శక్తిమంతమైన పదం 'ఓం' శబ్దంతో ప్రారంభమయ్యే ఈ మంత్రం రాముడితో సంబంధం ఉన్న దైవిక శక్తులకు కనెక్ట్ కావడానికి సాయపడుతుంది. భక్తి శ్రద్ధలతో ఈ మంత్రాన్ని పఠిస్తే ఎనలేని ఉత్సాహం, ధైర్యం వస్తుంది.


రామ గాయత్రీ మంత్రం - ఓం దాశరథయే విద్మహే, సీతావల్లభాయ ధీమహి, తన్నో రామ ప్రచోదయాత్...

రామ్ గాయత్రీ మంత్రం మరొక శక్తివంతమైన మంత్రం. మొదటి 'ఓం' జపంతో, ఆపై దశరథుని కుమారుడిగా, సీత మాత భర్తగా శ్రీరాముడిని ప్రార్థిస్తూ, జ్ఞానం, ప్రకాశం కోసం భక్తుడు రామచంద్రుడిని ప్రార్థిస్తాడు. ఈ మంత్రం శారీరక, మానసిక దృఢత్వాన్ని పెంపొందిస్తుంది. 'తన్నో రామ్ ప్రచోదయాత్' అంటే జీవితంలో మంచి మార్గాన్ని చూపించమని అర్థం.

రామ మంత్రం - శ్రీ రామ్ జయ రామ్ కోదండ రామ్..

రాముడి విరోచితం, పరాక్రమాన్ని సూచించేదే ఈ రామ మంత్రం. కోదండ అనేది శ్రీ రాముడి విల్లు. అది పరాక్రమానికి, ధైర్య సాహసాలకు, విజయానికి చిహ్నం. ఈ మంత్రాన్ని పఠించడం అంటే దుష్ఠ శక్తులపై శ్రీ రాముడు సాధించిన విజయాన్ని గుర్తు చేసుకోవడం. ఈ మంత్రం భక్తుల్లో ధైర్యాన్ని నింపుతుంది. ధర్మంతోని కట్టుబడి ఉండే ఎవరినైనా విజయం వరిస్తుందని తెలియజేస్తుంది.

విష్ణు మంత్రం - ఓం నమో భగవతే వాసుదేవాయ నమః

రాముడు విష్ణువు అవతారం. విష్ణు భగవంతుడు భక్తులకు అపారమైన శక్తిని ఇస్తాడు. విష్ణు మంత్రాన్ని పఠించడం అంటే ఇద్దరు దేవుళ్లను స్మరించుకోవడమే అవుతుంది. మంత్రాన్ని పఠించినవారు విష్ణువు శక్తిని పొందుతారని భక్తుల నమ్మకం.

Updated Date - Jan 21 , 2024 | 12:59 PM

Advertising
Advertising