ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

AAP: ఏకగ్రీవంగా ఎన్నికైన 'ఆప్' రాజ్యసభ అభ్యర్థులు

ABN, Publish Date - Jan 12 , 2024 | 04:41 PM

ఆమ్ ఆద్మీ పార్టీ భ్యులు సంజయ్ సింగ్, స్వాతి మలివాల్, ఎన్‌డీ గుప్తా ఏకగ్రీవంగా రాజ్యసభకు ఎన్నికయ్యారు. సంజయ్ సింగ్, ఎన్‌డీ గుప్తా, సుశీల్ గుప్తాల రాజ్యసభ పదవీకాలం జనవరి 27తో ముగియనుంది. ఈ నేపథ్యంలో సింగ్, గుప్తాలను రెండోసారి రాజ్యసభకు పార్టీ నామినేట్ చేసింది. సుశీల్ గుప్తా స్థానంలో డీసీడబ్ల్యూ మాజీ చీఫ్ స్వాతి మలివాల్‌ను 'ఆప్' నామినేట్ చేసింది.

న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) సభ్యులు సంజయ్ సింగ్ (Sanjay ingh), స్వాతి మలివాల్ (Swati Maliwal), ఎన్‌డీ గుప్తా (ND Gupta) ఏకగ్రీవంగా రాజ్యసభ (Rajya Sabha)కు ఎన్నికయ్యారు. వీరికి గెలుపు పత్రాలను రిటర్నింగ్ అధికారి అందజేశారు. సంజయ్ సింగ్, ఎన్‌డీ గుప్తా, సుశీల్ గుప్తాల రాజ్యసభ పదవీకాలం జనవరి 27తో ముగియనుంది. ఈ నేపథ్యంలో సింగ్, గుప్తాలను రెండోసారి రాజ్యసభకు పార్టీ నామినేట్ చేసింది. సుశీల్ గుప్తా స్థానంలో డీసీడబ్ల్యూ మాజీ చీఫ్ స్వాతి మలివాల్‌ను 'ఆప్' నామినేట్ చేసింది.


ఆప్ నామినేట్ చేసిన ముగ్గురు సభ్యలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని, ఆ ముగ్గురు మినహా ఎవరూ నామినేషన్లు దాఖలు చేయలేదనీ రిటర్నింగ్ అధికారి తెలిపారు. నామినేషన్ల గడువు జనవరి 9వ తేదీతో, నామినేషన్ల పరిశీలన జనవరి 10వ తేదీతో ముగిసింది. అభ్యర్థుల నామినేషన్ గడువు జనవరి 12వ తేదీతో ముగిసింది.

Updated Date - Jan 12 , 2024 | 04:41 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising