Actor Arjun: మోదీ అంటే మా కుటుంబానికి ఎంతో ఇష్టం.. కానీ.. నేను బీజేపీలో చేరలేదు
ABN, Publish Date - Jan 21 , 2024 | 12:46 PM
ప్రధానిని కలుసుకోవడంలో రాజకీయం లేదని, తాను బీజేపీలో చేరలేదని నటుడు అర్జున్(Actor Arjun) స్పష్టం చేశారు.
- నటుడు అర్జున్
పెరంబూర్(చెన్నై): ప్రధానిని కలుసుకోవడంలో రాజకీయం లేదని, తాను బీజేపీలో చేరలేదని నటుడు అర్జున్(Actor Arjun) స్పష్టం చేశారు. చెన్నైలో నిర్వహిస్తున్న ‘ఖేలో ఇండియా’ పోటీలను శుక్రవారం ప్రధాని నరేంద్రమోదీ(Prime Minister Narendra Modi) ప్రారంభించిన విషయం తెలిసిందే. చెన్నైకి వచ్చిన ప్రధానమంత్రిని నటుడు అర్జున్ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. దీంతో, ఆయన బీజేపీలో చేరుతున్నారనే వార్తలు సోషల్ మీడియాలో వెలువడ్డాయి. ప్రధానితో భేటీపై నటుడు అర్జున్ స్పందిస్తూ... తాను బీజేపీ(BJP)లో చేరుతున్నట్లు పలు కథనాలు వస్తున్నాయని, ఆ వార్తల్లో నిజం లేదన్నారు. ప్రధాని మోదీ అంటే తమ కుటుంబానికి ఎంతో ఇష్టమని, తాను నిర్మించిన ఆలయానికి రావాలని ప్రధానిని ఆహ్వానించానని తెలిపారు. అందుకు అంగీకరించిన ప్రధాని, త్వరలోనే వస్తానని తెలిపారన్నారు. తాను బీజేపీ చేరుతున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని, తనకు రాజకీయాలపై ఆసక్తి లేదని అర్జున్ తెలిపారు.
Updated Date - Jan 21 , 2024 | 12:46 PM