ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

తగిన ఆధారాల్లేవ్‌!

ABN, Publish Date - Feb 23 , 2024 | 05:49 AM

భారతీయ విద్యార్థిని జాహ్నవి కందుల(23) మరణానికి కారణమైన సియాటెల్‌ పోలీసు అధికారి కెవిన్‌ డేవ్‌ నేర అభియాగాలను ఎదుర్కోబోరని అధికారులు వెల్లడించారు.

అమెరికాలో కందుల జాహ్నవి యాక్సిడెంట్‌

కేసులో నిందితుడైన అధికారికి విముక్తి

వాషింగ్టన్‌, ఫిబ్రవరి 22: భారతీయ విద్యార్థిని జాహ్నవి కందుల(23) మరణానికి కారణమైన సియాటెల్‌ పోలీసు అధికారి కెవిన్‌ డేవ్‌ నేర అభియాగాలను ఎదుర్కోబోరని అధికారులు వెల్లడించారు. తగిన ఆధారాలు లేకపోవడమే కారణంగా పేర్కొన్నారు. ‘జాహ్నవి మరణం హృదయ విదారకంగా ఉంది. కింగ్‌ కౌంటీతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులను ఆ ఘటన ప్రభావితం చేసింది’ అని కింగ్‌ కౌంటీ ప్రాసిక్యూటింగ్‌ అటార్నీ లీసా మానియన్‌ బుధవారం విడుదల చేసిన నివేదికలో పేర్కొన్నారు. అయితే, ఈ కేసులో సహేతుకమైన సందేహానికి మించి క్రిమినల్‌ కేసుగా నిరూపించదగిన ఆధారాలు లేవన్నారు. గతేడాది జనవరి 23న సియాటెల్‌లో రోడ్డు దాటుతున్న జాహ్నవిని కెవిన్‌ డేవ్‌ నడుపుతున్న పోలీసు గస్తీ వాహనం గంటకు 119 కిలోమీటర్ల వేగంతో ఢీకొంది. దీంతో జాహ్నవి 100 అడుగుల దూరం ఎగిరిపడి అక్కడికక్కడే మరణించారు.

Updated Date - Feb 23 , 2024 | 05:49 AM

Advertising
Advertising