ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

AI linked City: ఏఐ మిమ్మల్ని గమనిస్తోంది..ఈ వ్యవస్థ కల్గిన తొలి నగరంగా కీలక ప్రాంతం

ABN, Publish Date - Jan 03 , 2024 | 04:16 PM

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకం దేశంలో క్రమంగా పెరుగుతోంది. ఈ క్రమంలో దేశంలోనే తొలిసారిగా అహ్మదాబాద్‌(ahmedabad)లో ఆర్టిఫియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఏఐ నిఘా వ్యవస్థ అమల్లోకి వచ్చింది.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) వాడకం దేశంలో క్రమంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో దేశంలోనే తొలిసారిగా అహ్మదాబాద్‌(ahmedabad)లో ఆర్టిఫియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఏఐ నిఘా వ్యవస్థ అమల్లోకి వచ్చింది. అయితే దీని ద్వారా ట్రాఫిక్, భద్రత, పరిశుభ్రతను పర్యవేక్షించడం వంటి అంశాలను మానిటరింగ్ చేయనున్నారు. దీంతోపాటు పోలీసు విభాగంలో కూడా ఉపయోగించనున్నారు.


ఈ క్రమంలో పాల్ది ప్రాంతం ప్రస్తుతం ఆర్టిఫియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత కమాండ్ కంట్రోల్ కేంద్రానికి నిలయంగా మారింది. దీంతో అహ్మదాబాద్‌తోపాటు దాని పరిసర ప్రాంతాల్లో 460 చదరపు కిలోమీటర్ల వరకు ఏఐ పరిధిలోకి రానుంది. ఈ ఏఐ ఆధారిత నిఘా వ్యవస్థ కోసం డ్రోన్స్‌(Drones)ను కూడా ఉపయోగిస్తున్నారు. దీంతోపాటు ట్రాఫిక్ సిగ్నల్ ప్రాంతాలు, బస్సుల్లో కూడా కెమెరాలను ఏర్పాటు చేశారు. ఇంకోవైపు మొత్తం నగరవ్యాప్తంగా వీక్షించేందుకు ఆరు కెమెరాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.

ఈ వ్యవస్థ ద్వారా ప్రధానంగా ట్రాఫిక్ ఉల్లంఘనలు లేదా ఇతర గుర్తించలేని కార్యకలాపాలను మానిటరింగ్ చేయవచ్చు. దీంతోపాటు ఎవరైనా తప్పిపోయిన(missing) వారిని గుర్తించడం, చోరీ వంటి సంఘటలను సులభంగా గుర్తించవచ్చు. అక్రమ పార్కింగ్, చెత్త పేరుకుపోవడం ఇతర పౌర సమస్యలను గుర్తించడంలో సహాయపడుతుంది. ఈ క్రమంలో సమస్యలను సత్వరమే గుర్తించి పరిష్కరించవచ్చు. దీంతోపాటు పౌరులపై కూడా నిఘా ఉన్న కారణంగా వారు అప్రమత్తంగా ఉండే అవకాశం ఉంది.

Updated Date - Jan 03 , 2024 | 04:16 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising