ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Delhi: ప్రధాని మోదీ ఆడిన ఈ గేమ్ ఏంటో మీకు తెలుసా..

ABN, Publish Date - Apr 13 , 2024 | 02:58 PM

దేశంలోని ప్రముఖ గేమర్లతో ప్రధాని మోదీ(PM Modi) శనివారం చిట్ చాట్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ గేమర్లు అనిమేష్ అగర్వాల్, మిథిలేష్ పాటంకర్, పాయల్ ధరే, నమన్ మాథుర్‎తో పాటు అన్షు బిష్త్ లు పాల్గొన్నారు.

ఢిల్లీ: దేశంలోని ప్రముఖ గేమర్లతో ప్రధాని మోదీ(PM Modi) శనివారం చిట్ చాట్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ గేమర్లు అనిమేష్ అగర్వాల్, మిథిలేష్ పాటంకర్, పాయల్ ధరే, నమన్ మాథుర్‎తో పాటు అన్షు బిష్త్ లు పాల్గొన్నారు. వీరితో కలిసి మోదీ గేమ్ ఆడారు. గేమింగ్ పరిశ్రమ భవిష్యత్తు గురించి మాట్లాడేందుకు మోదీ గేమర్‌లతో ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.

భారతీయ పురాణాల ఆధారంగా గేమింగ్ లను రూపొందించాలని వారికి సూచించారు. ఇలాంటి వాటిపై భారతీయులకు ఎంతో ఆసక్తి ఉంటుందన్నారు. ఇలా చేయడం వల్ల ఆడే వారి సంఖ్య పెరుగుతుందన్నారు. అందులో మహిళలను భాగస్వామ్యం చేయడంతో వారికి ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు. ఈ సందర్భంగా మోదీ ఓ గేమ్ ఆడారు. అదేంటనేది ప్రస్తుతం నెట్టింత తెగ సర్చ్ చేస్తున్నారు నెటిజన్లు.


రాజి: ఒక పురాతన ఇతిహాసం..

"రాజీ: ఎన్ ఏన్షియంట్ ఎపిక్" అనేది దేశంలోని స్వతంత్ర గేమ్ స్టూడియో అయిన నోడింగ్ హెడ్స్ గేమ్‌లు అభివృద్ధి చేసిన యాక్షన్-అడ్వెంచర్ వీడియో గేమ్. పురాతన భారతదేశం నేపథ్యంలో రూపొందించబడిన ఈ గేమ్ పురాణాలు, సంస్కృతి నుంచి ప్రేరణ పొందింది. "రాజీ: యాన్ ఏన్షియంట్ ఎపిక్" 2020లో PC, PlayStation 4, Xbox One, Nintendo Switch సహా వివిధ ప్లాట్‌ఫారమ్‌లలో విడుదలైంది. 2021లో ఈ గేమ్‌కు బెస్ట్ నేరేషన్, గ్రాండ్ ప్రిక్స్, విన్నర్స్ సర్కిల్ అవార్డులు వచ్చాయి. ఈ గేమ్‌లో.. రాజీ, గోలు సోదరులపై దెయ్యాలు దాడి చేస్తుంటాయి. రాజి దయ్యాలతో యుద్ధం చేసి సోదరుడిని కాపాడాలి.

Kejriwal: ఇదేం పద్ధతి.. జైలులో కేజ్రీవాల్‌ను కలువనీయలేదు..?

అయితే.. రాక్షసుల గురువైన మహాబలాసురుడు రూపొందించిన శక్తిని, వ్యూహాన్ని పసిగట్టగలిగితేనే దెయ్యాలను ఓడించగలరు. గేమ్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉంటుంది. ఇదే గేమ్‌ను ప్రధాని ఆడారు. అయితే గేమర్లతో సమావేశంలో దేశ గేమర్స్ ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి కూడా చర్చ జరిగింది.

గేమింగ్ అనేది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని వారు తెలిపారు. దీని వెనుక ఎంత యానిమేషన్ వర్క్ ఉంటుందో మోదీకి వివరించారు. ఆన్‌లైన్ గేమింగ్ విషయంలో ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఎలాంటి నియమాలను రూపొందించిందో మోదీ వారికి తెలిపారు. ప్రభుత్వం గేమింగ్ రంగానికి ఇస్తున్న ప్రాధాన్యతను వివరించారు.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Apr 13 , 2024 | 02:59 PM

Advertising
Advertising