Ayodhya Ram Temple: ప్రాణప్రతిష్ఠ సమయం ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే..
ABN, Publish Date - Jan 15 , 2024 | 04:49 PM
అయోధ్యలోని రామమందిర ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి సమయం నిశ్చయమైంది. జనవరి 22వ తేదీ 12.20 గంటలకు ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం మొదలై మధ్యాహ్నం 2.00 గంటలకు ముగుస్తుంది. శ్రీ రామ్ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ ఈ విషయం సోమవారంనాడు వెల్లడించారు.
న్యూఢిల్లీ: దేశవిదేశీ భక్తులు సైతం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అయోధ్యలోని రామమందిర (Ayodhya Ram Temple) ప్రాణప్రతిష్ఠ (Consecration ceremony) కార్యక్రమానికి సమయం నిశ్చయమైంది. జనవరి 22వ తేదీ 12.20 గంటలకు ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం మొదలై మధ్యాహ్నం 2.00 గంటలకు ముగుస్తుంది. శ్రీ రామ్ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్టు (Sri Ram Janmabhoomi Teerth Kshetra Trust) ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ (Champat Rai) ఈ విషయం సోమవారంనాడు వెల్లడించారు.
''జనవరి 16వ తేదీ నుంచి ప్రాణప్రతిష్ఠ ఉత్సవాలు ప్రారంభమై 21వ తేదీ వరకూ జరుగుతాయి. 22న ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ఉంటుంది. ప్రాణప్రతిష్ఠ జరుగనున్న విగ్రహం బరువు 150 నుంచి 200 కేజీల వరకూ ఉంటుందని అంచనా వేస్తున్నాం. జనవరి 18న ఆలయ గర్భగుడిలో విగ్రహాన్ని ఉంచుతాం'' అని చంపత్ రాయ్ తెలిపారు.
'దివ్య అయోధ్య' యాప్‌ను ప్రారంభించిన యోగి
చారిత్రక రామాలయం ప్రారంభోత్సవం సందర్భంగా లక్షలాది మంది టూరిస్టులకు అయోధ్య స్వాగతం పలుకుతోంది. విజిటర్ల సౌలభ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం 'దివ్య అయోధ్య' పేరుతో మొబైల్ అప్లికేషన్‌ను తెస్తోంది. ఈ యాప్‌ను ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రారంభించారు. పర్యాటక ప్రణాళిక, అయోధ్యలో జరిగే సాంస్కృతిక ఉత్సవాలు, ప్రదాన ఆలయాలు, చారిత్రక ప్రదేశాలు, టైమ్‌టేబుల్, హోటళ్లు, రెంటెడ్ హౌస్‌లు, గైడ్స్‌తో సహా అన్ని రకాల సదుపాయాలకు సంబంధించిన సమాచారం ఇందులో పొందుపరిచారు.
Updated Date - Jan 15 , 2024 | 04:52 PM