Ayodhya Ram Mandir: అయోధ్య రామయ్య దర్శనం టికెట్స్ ఇలా బుక్ చేసుకోండి..
ABN, Publish Date - Jan 20 , 2024 | 09:54 PM
Ayodhya Ram Mandir Opening Ceremony: యావత్ ప్రపంచం ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవానికి మరో రెండు రోజులు మాత్రమే మిగిలి ఉంది. రామ్‌లల్లా పవిత్రోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే అయోధ్య రామ మందిరం ఎప్పుడు ఓపెన్ అవుతుందా? ఎప్పుడు రాములోరిని దర్శించుకుందామా? అని ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది భక్తులు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు.
Ayodhya Ram Mandir Opening Ceremony: యావత్ ప్రపంచం ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవానికి మరో రెండు రోజులు మాత్రమే మిగిలి ఉంది. రామ్‌లల్లా పవిత్రోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే అయోధ్య రామ మందిరం ఎప్పుడు ఓపెన్ అవుతుందా? ఎప్పుడు రాములోరిని దర్శించుకుందామా? అని ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది భక్తులు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. అదే సమయంలో స్వామి వారిని ఎలా దర్శించుకోవాలి? ఇందుకోసం ఏమైనా ప్రాసెస్ ఉందా? పాస్‌లు ఇస్తారా? టికెట్లు ఎలా బుక్ చేసుకోవాలి? ప్రత్యేక పూజలు చేయించాలంటే ఎలా? అనే రకరకాల సందేహాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. ఈ సందేహాలన్నింటికీ క్లారిటీ ఈ వార్తలో తెలుసుకుందాం.
అయోధ్య రామమందిరం హారతి టైమింగ్స్..
👉 జాగరన్/శృంగార్ హారతి - 6:30 AM
👉 భోగ్ హారతి - 12 PM
👉 సంధ్యా హారతి - 7:30 PM
అయోధ్య రామమందిరం దర్శన్ టైమింగ్స్..
భక్తులు అయోధ్య రామయ్యను ఉదయం 7:00 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 2:00 నుండి రాత్రి 7:00 వరకు దర్శించుకోవచ్చు.
అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం.. పాస్ బుకింగ్ గైడింగ్..
ఆన్‌లైన్ బుకింగ్:
👉 శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లాలి.
👉 మొబైల్ నెంబర్ లాగిన్ అవ్వాలి.
👉 ఓటీవీ ద్వారా లాగిన్ అవ్వొచ్చు.
👉 హారతి లేదా దర్శనం కోసం స్లాట్‌ను బుక్ చేసుకోవడానికి 'మై ప్రొఫైల్' ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
👉 కావలసిన తేదీ, ఆరతి సమయాన్ని సెలక్ట్ చేసుకోవాలి.
👉 అవసరమైన ఆధారాలు/ధృవీకరణ పత్రాలు సమర్పించాలి.
👉 హారతి వేడుకకు ముందు ఆలయ ప్రాంగణంలో కౌంటర్ నుండి పాస్‌లను తీసుకోవచ్చు.
అదే రోజు బుకింగ్..
👉 అదే రోజు బుకింగ్‌లు స్లాట్ లభ్యతకు లోబడి ఉంటాయి.
👉 హారతి షెడ్యూల్‌కు 30 నిమిషాల ముందు భక్తులు శ్రీరామ జన్మభూమి తీర్థ క్యాంపు కార్యాలయానికి చేరుకోవాల్సి ఉంటుంది.
👉 హారతి పాస్‌ల కోసం భక్తులు చెల్లుబాటు అయ్యే ప్రభుత్వ గుర్తింపు కార్డు(ఆధార్ కార్డ్/ఓటర్ ఐడీ) తీసుకెళ్లాలి.
Updated Date - Jan 20 , 2024 | 10:31 PM