ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

INDIA alliance: కూటమి కన్వీనర్‌ పదవిని నిరాకరించిన నితీష్

ABN, Publish Date - Jan 13 , 2024 | 03:24 PM

లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీపై సమష్టి పోరాటానికి ఏర్పడిన 'ఇండియా' కూటమికి కన్వీనర్‌గా వ్యవహరించేందుకు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నిరాకరించారు. ఈ పదవిని కాంగ్రెస్‌కు చెందిన వేరెవరికైనా అప్పగించాలని నితీష్ సూచించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. 'ఇండియా' కూటమి వర్చువల్ సమావేశం శనివారం మధ్యాహ్నం జరిగింది.

న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీపై సమష్టి పోరాటానికి ఏర్పడిన 'ఇండియా' (I.N.D.I.A.) కూటమికి కన్వీనర్ (convenor)గా వ్యవహరించేందుకు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ (Nitish Kumar) నిరాకరించారు. ఈ పదవిని కాంగ్రెస్‌కు చెందిన వేరెవరికైనా అప్పగించాలని నితీష్ సూచించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. 'ఇండియా' కూటమి వర్చువల్ సమావేశం శనివారం మధ్యాహ్నం జరిగింది. సీట్ల షేరింగ్ ఎజెండా, భారత్ జోడో న్యాయ్ యాత్రలో పాల్గొనడం, కూటమికి సంబంధించిన ఇతర అంశాలపై చర్చించేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ముంబై నుంచి వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్ పాల్గొన్నారు. చెన్నై నుంచి తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే నేత ఎంకే స్టాలిన్, ఆ పార్టీ నేత కనిమొళి కరుణానిధి పాల్గొన్నారు. ముందస్తు కార్యక్రమాల రీత్యా ఈ వర్చువల్ మీట్‌లో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పాల్గొనలేదు.


కాగా, ఇండియా బ్లాక్‌లోని వివిధ పార్టీలతో రాష్ట్ర స్థాయిలో పొత్తుల కోసం కాంగ్రెస్ అలయెన్స్ కమిటీ సమాంతర సమావేశాలు జరుపుతోంది. సీట్ల షేరింగ్‌కు సంబంధించి ఆమ్ ఆద్మీ పార్టీ నేతలతో కాంగ్రెస్ పార్టీ శుక్రవారంనాడు సమావేశం జరిపింది. ముకుల్ వాస్నిక్ నివాసంలో రెండు గంటల సేపు జరిగిన సమావేశంలో ఇరుపార్టీల నేతలు పాల్గొన్నారు. పొత్తులపై రెండు పార్టీల మధ్య సయోధ్య కుదిరినట్టు తెలుస్తోంది. కాగా, శనివారంనాడు జార్ఖాండ్ నేతలతో కాంగ్రెస్ చర్చలు జరుపుతోంది.

Updated Date - Jan 13 , 2024 | 03:24 PM

Advertising
Advertising