Bihar: బిహార్‌లో హీటెక్కిన రాజకీయాలు.. నేడు సీఎం పదవికి నితీశ్ రాజీనామా!
ABN, Publish Date - Jan 27 , 2024 | 11:43 AM
బిహార్ రాజకీయాలు(Bihar Politics) రసవత్తరంగా మారుతున్నాయి. సీఎం నితీశ్ కుమార్ తన పదవికి రాజీనామా చేస్తారని, ఆ వెంటనే బీజేపీ(BJP)తో కూడిన కూటమితో కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారనే ఊహాగానాలు కొన్ని రోజులుగా వినిపిస్తున్నాయి.
పట్నా: బిహార్ రాజకీయాలు(Bihar Politics) రసవత్తరంగా మారుతున్నాయి. సీఎం నితీశ్ కుమార్ తన పదవికి రాజీనామా చేస్తారని, ఆ వెంటనే బీజేపీ(BJP)తో కూడిన కూటమితో కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారనే ఊహాగానాలు కొన్ని రోజులుగా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆయన శనివారం సీఎం పదవికి రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది.
ఇందులో భాగంగా నితీశ్ జేడీ(యూ)(JDU) ఎమ్మెల్యేలను పట్నాకు పిలిపించినట్లు సమాచారం. రాజీనామా అనంతరం బీజేపీ మద్దతుతో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు ఆయన మార్గం సుగమం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. సంకీర్ణ ప్రభుత్వంలో కూడా ఆయనే సీఎంగా ఉండేలా ప్రణాళికలు రచిస్తున్నారు. దీంతో ఆర్జేడీ, జేడీ(యూ), కాంగ్రెస్ పార్టీల బంధానికి తెర పడనుంది.
అటూ.. ఇటూ..
బిహార్ పరిణామాలపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా(AmithShah), బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా(JP Nadda) శుక్రవారం ఢిల్లీలో కీలక చర్చ జరిపినట్లు తెలుస్తోంది. బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇవాళ పట్నాలో సమావేశం కానున్నారు. కొత్త ప్రభుత్వ ఏర్పాటు నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది.
మరోవైపు రాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో సీఎల్పీ నేత షకీల్ అహ్మద్ ఖాన్ భేటీ కావడం ఆసక్తిగా మారింది. ఇంకోవైపు ఉపముఖ్యమంత్రి, ఆర్జేడీ సీనియర్ నేత తేజస్వీ యాదవ్‌ను ఆ పార్టీ ఎమ్మెల్యేలు వరుసగా కలుస్తున్నారు. దీంతో బిహార్ రాజకీయ మలుపులపై ఆసక్తి పెరుగుతోంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Updated Date - Jan 27 , 2024 | 12:02 PM