ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

BJP: ఐదుగురు రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ అధిష్ఠానం

ABN, Publish Date - Feb 14 , 2024 | 10:52 AM

త్వరలోనే జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసే ఐదుగురు రాజ్యసభ అభ్యర్థులను బీజేపీ అధిష్ఠానం ప్రకటించింది. కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్‌ను మరోసారి రాజ్యసభకు పంపించాలని పార్టీ నిర్ణయించింది. ఒడిశా నుంచి వైష్ణవి అశ్విని వైష్ణవ్ పేరును పార్ట ఖరారు చేసింది.

న్యూఢిల్లీ: త్వరలోనే జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసే ఐదుగురు రాజ్యసభ అభ్యర్థులను బీజేపీ అధిష్ఠానం ప్రకటించింది. కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్‌ను మరోసారి రాజ్యసభకు పంపించాలని పార్టీ నిర్ణయించింది. ఒడిశా నుంచి వైష్ణవి అశ్విని వైష్ణవ్ పేరును పార్ట ఖరారు చేసింది. ఇక మధ్యప్రదేశ్ నుంచి నలుగురు అభ్యర్థులను, ఒడిశా నుంచి ఒకరిని పేర్లను వెల్లడించింది. మధ్యప్రదేశ్ నుంచి ఎల్ మురుగన్, ఉమేశ్ నాథ్ మహరాజ్, మయ నారోల్య, బన్సీలాల్ గర్జర్‌‌లను అభ్యర్థులుగా ప్రకటించింది. కాగా రాజ్యసభ నామినేషన్ల దాఖలు గడవు రేపటితో (గురువారం) ముగియనుంది. దీంతో నేడు(బుధవారం) లేదా గురువారం ఉదయం అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయనున్నారు.

కాగా తెలంగాణలో మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనుండగా రెండింటిని కాంగ్రెస్‌, ఒక సీటును బీఆర్ఎస్‌కు ఒక దక్కే అవకాశం ఉంది. రాజ్యసభ అభ్యర్థుల ఎంపికను కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే పూర్తి చేసింది. రెండు రాజ్యసభ స్థానాల్లో ఒకటి ఏఐసీసీకి, మరొకటి తెలంగాణ కాంగ్రెస్ నేతలకు పార్టీ హైకమాండ్ ఇచ్చింది. ఏఐసీసీ కోటాలో ఏఐసీసీ ట్రెజరర్ అజయ్ మాకెన్ పేరు దాదాపు ఖరారైంది. ఇక తెలంగాణ కోటాలో భారీగా ఆశావాహులు ఉన్నారు. రేణుక చౌదరి, వీహెచ్, చిన్నారెడ్డి, అద్దంకి దయాకర్‌తో పాటు పలువురు ఈ రేసులో ఉన్నారు.

Updated Date - Feb 14 , 2024 | 10:52 AM

Advertising
Advertising