ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

BJP MP Upendra Singh: బీజేపీ ఎంపీ ఉపేంద్ర సింగ్ అశ్లీల వీడియో.. తీరా చూస్తే కథలో ఊహించని ట్విస్ట్

ABN, Publish Date - Mar 04 , 2024 | 03:32 PM

ఎన్నికల సమయంలో రాజకీయాలు ఎలా వేడుక్కుతాయో అందరికీ తెలుసు. అధికార, ప్రతిపక్ష పార్టీ నేతలు తమ విమర్శల దాడిని పెంచడంతో పాటు కొన్ని విచిత్ర చర్యలకు పాల్పడుతుంటారు. ప్రత్యర్థి ఇమేజ్‌ని దెబ్బ కొట్టేందుకు అసత్య ప్రచారాలకు కూడా దిగుతుంటారు. తాజాగా ఇలాంటి పరిణామమే బీజేపీ ఎంపీ ఉపేంద్ర సింగ్ రావత్‌కు (BJP MP Upendra Singh Rawat) ఎదురైంది.

ఎన్నికల సమయంలో రాజకీయాలు ఎలా వేడుక్కుతాయో అందరికీ తెలుసు. అధికార, ప్రతిపక్ష పార్టీ నేతలు తమ విమర్శల దాడిని పెంచడంతో పాటు కొన్ని విచిత్ర చర్యలకు పాల్పడుతుంటారు. ప్రత్యర్థి ఇమేజ్‌ని దెబ్బ కొట్టేందుకు అసత్య ప్రచారాలకు కూడా దిగుతుంటారు. తాజాగా ఇలాంటి పరిణామమే బీజేపీ ఎంపీ ఉపేంద్ర సింగ్ రావత్‌కు (BJP MP Upendra Singh Rawat) ఎదురైంది. ఉత్తరప్రదేశ్‌లోని (Uttar Pradesh) బారాబంకీ స్థానం నుంచి బీజేపీ టికెట్ ఇచ్చిన కొన్ని గంటల్లోనే.. ఆయనకు సంబంధించి ఒక అశ్లీల వీడియో వెలుగులోకి వచ్చింది. ఆన్‌లైన్‌లో వైరల్ అవుతున్న ఈ వీడియోలో.. ఓ వ్యక్తి ఒక మహిళతో అభ్యంతరకర స్థితిలో కనిపించినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.


ఈ వీడియో ఇలా బయటకు రావడమే ఆలస్యం.. రాజకీయ వర్గాల్లో అది తీవ్ర కలకలం రేపింది. అయితే.. ఆ వీడియోని పరిశీలించగా, అది నకిలీదని తేలింది. దీంతో.. దీనిపై ఎంపీ ఉపేంద్ర సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ అశ్లీల వీడియో (Obscene Video) నకిలీది అని, తన ప్రతిష్ఠకు భంగం కలిగించే ఉద్దేశంతోనే ప్రత్యర్థులు ఈ దారుణ చర్యకు ఒడిగట్టారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ చర్యకి పాల్పడిన నిందితులను గుర్తించి, వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇది ప్రత్యర్థులు చేసిన పనేనా? లేక సొంత గూటిలో ఉన్నవాళ్లే ఎవరైనా ఉపేంద్రపై అక్కసుతో ఈ పనికి పాల్పడ్డారా? అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.

ఇదిలావుండగా.. 2019 లోక్‌సభ ఎన్నికల్లో అప్పటి సిట్టింగ్ ఎంపీ ప్రియాంక సింగ్ రావత్‌ను (Priyanka Singh Rawat) కాదని, ఉపేంద్ర సింగ్‌కు బీజేపీ టికెట్ ఇచ్చింది. ఇప్పుడు మరోసారి ఆయనకే అవకాశం కల్పించింది. తాము నిర్వహించిన సర్వేల్లో భాగంగా.. ఉపేంద్రకు సానుకూల ఫలితాలు వచ్చిన తరుణంలో, మళ్లీ ఆయనవైపు బీజేపీ మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. కాగా.. ఇటీవల 195 మంది అభ్యర్థులతో బీజేపీ తొలి జాబితాని (BJP MP Candidates First List) విడుదల చేసిన విషయం తెలిసిందే.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 04 , 2024 | 03:32 PM

Advertising
Advertising