ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

CPI Narayana.. బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తున్నారు: నారాయణ

ABN, Publish Date - Jan 25 , 2024 | 01:12 PM

న్యూఢిల్లీ: దేశంలో రాజకీయ పరిస్థితులు ఆందోళనకరంగా మారాయని, రాజకీయాలకు సంబంధం లేకుండా ఒక మతాన్ని పెంపొందించారని, కాబినెట్‌లో కూడా మతాన్ని రాజకీయం చేశారని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు.

న్యూఢిల్లీ: దేశంలో రాజకీయ పరిస్థితులు ఆందోళనకరంగా మారాయని, రాజకీయాలకు సంబంధం లేకుండా ఒక మతాన్ని పెంపొందించారని, కాబినెట్‌లో కూడా మతాన్ని రాజకీయం చేశారని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. ఈ సందర్భంగా గురువారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఏ రాజ్యాంగానికి లోబడి ఎన్నికయ్యారో దానికి మూడు నామాలు పెట్టారని, మతం, రాజకీయం ఒకటి చేశారని ఆరోపించారు. అయోధ్య రామాలయం నిర్మాణంకు తాము వ్యతిరేకం కాదని, అన్ని ఊర్లలో రామాలయాలు ఉన్నాయన్నారు. అయోధ్యలో ఒక ఈవెంట్ లాగా రామాలయంను మోదీ, యోగి ఓపెనింగ్ చేశారని విమర్శించారు.

బాబ్రీ మసీదు ఘటనలో అద్వానీ ఉన్నారని, అలాంటి అద్వానీ రామాలయం ప్రారంభోత్సవానికి రాలేదని, బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తున్నారని నారాయణ విమర్శించారు. ప్రపంచం మొత్తం బాబ్రీ మసీదు కులగొట్టిన అంశాన్ని చూశారని, అయోధ్య తీర్పు ఇచ్చిన వారిలో ఒకరు రాజ్యసభలో, మరొకరు ఏపీ గవర్నర్‌గా ఉన్నారన్నారు. అయోధ్య రామాలయం ప్రారంభానికి రాష్ట్రపతిని ఎందుకు పిలవలేదని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఇంకా విశాలంగా ఆలోచన చేయాలన్నారు. మోదీ బ్లాక్ మెయిల్‌తో కొందరు వెనక్కి వెళ్తున్నారన్నారు. కాంగ్రెస్ ఇంకా అందరినీ కలుపుకొని పోవాలని, సెక్యూలర్ అని చెప్పుకునే వారు బీజేపీకి ఊడిగం చేస్తున్నారని నారాయణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

Updated Date - Jan 25 , 2024 | 02:15 PM

Advertising
Advertising