ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

MEA: ఆ రెండు దేశాలకు వెళ్లొద్దు.. అక్కడున్న భారతీయులు వెంటనే పేర్లు నమోదు చేసుకోండి: కేంద్రం కీలక ప్రకటన

ABN, Publish Date - Apr 12 , 2024 | 06:44 PM

తదుపరి నోటీసులు ఇచ్చేంతవరకు భారతీయ పౌరులెవరూ ఇరాన్, ఇజ్రాయెల్ దేశాలకు వెళ్లొద్దని కేంద్ర విదేశాంగశాఖ అడ్వైజరీ జారీ చేసింది. అక్కడ నెలకొన్న పరిస్థితులు దృష్ట్యా ఈ రెండు దేశాలకు ప్రయాణాన్ని విరమించుకోవాలని సూచించింది. ఇప్పటికే ఇరాన్, ఇజ్రాయెల్‌ దేశాల్లో ఉన్న భారతీయులు అక్కడి భారత రాయబార కార్యాలయాలను సంప్రదించి పేర్లను నమోదు చేసుకోవాలని సూచించింది.

న్యూఢిల్లీ: తదుపరి నోటీసులు ఇచ్చేంతవరకు భారతీయ పౌరులెవరూ ఇరాన్, ఇజ్రాయెల్ దేశాలకు వెళ్లొద్దని కేంద్ర విదేశాంగశాఖ అడ్వైజరీ జారీ చేసింది. అక్కడ నెలకొన్న పరిస్థితులు దృష్ట్యా ఈ రెండు దేశాలకు ప్రయాణాన్ని విరమించుకోవాలని సూచించింది. ఇప్పటికే ఇరాన్, ఇజ్రాయెల్‌ దేశాల్లో ఉన్న భారతీయులు అక్కడి భారత రాయబార కార్యాలయాలను సంప్రదించి పేర్లను నమోదు చేసుకోవాలని సూచించింది. ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల్లోని పౌరులు తమ భద్రతకు అధిక ప్రాధాన్యతమివ్వాలని, భద్రంగా ఉన్నామో లేదో గమనించుకోవాలని అడ్వైజరీ పేర్కొంది. కదలికలను వీలైనంత మేర తగ్గించుకోవాలని పేర్కొంది. ఈ సమాచారాన్ని భారత విదేశాంగ శాఖ అధికారిక ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ‘ఎక్స్’ వేదికగా షేర్ చేశారు.


కాగా ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో కేంద్రం ఈ ప్రకటన జారీ చేసింది. ఇటీవల సిరియాలోని ఇరాన్ రాయబార కార్యాలయంలో జరిగినలో 13 మంది మృత్యువాతపడ్డారు. అయితే ఈ దాడి చేసింది ఇజ్రాయెలేనని ఇరాన్ చెబుతోంది. ప్రతీకారం తీర్చుకుంటామని ప్రకటన కూడా చేసింది. ఇజ్రాయెల్‌పై తాము చేయబోతున్న దాడికి అడ్డు రావొద్దంటూ అమెరికాకు ఇరాన్ లేఖ కూడా రాసిన విషయం తెలిసిందే.

Updated Date - Apr 12 , 2024 | 06:55 PM

Advertising
Advertising