Amit Shah: షా కీలక ప్రకటన.. భారత్ - మియన్మార్ మధ్య కంచె
ABN, Publish Date - Jan 20 , 2024 | 05:01 PM
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా(Amith Shah) శనివారం కీలక ప్రకటన చేశారు. బంగ్లాదేశ్ నుంచి వలసలను ఆపినట్లే మియన్మార్ నుంచి వచ్చే వారికి అడ్డుకట్ట వేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. అసోం రాజధాని గౌహతిలో పోలీసు కమాండోల పాసింగ్ అవుట్ పరేడ్‌లో ఆయన మాట్లాడుతూ.. భారత్ - మియన్మార్ మధ్య కంచె వేస్తామని చెప్పారు.
ఢిల్లీ: కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా(Amith Shah) శనివారం కీలక ప్రకటన చేశారు. బంగ్లాదేశ్ నుంచి వలసలను ఆపినట్లే మియన్మార్ నుంచి వచ్చే వారికి అడ్డుకట్ట వేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. అసోం రాజధాని గౌహతిలో పోలీసు కమాండోల పాసింగ్ అవుట్ పరేడ్‌లో ఆయన మాట్లాడుతూ.. భారత్ - మియన్మార్ మధ్య కంచె వేస్తామని చెప్పారు. బంగ్లాదేశ్‌తో భారత్‌కు ఉన్న సరిహద్దు మాదిరిగానే మియన్మార్‌కి సైతం కంచె వేయాలని ప్రధాని మోదీ నిర్ణయించారని షా స్పష్టం చేశారు. దీంతో ఇరు దేశాల సరిహద్దుకు దగ్గరగా నివసించే వ్యక్తులు.. వీసా లేకుండా 16 కి.మీ.లు మరొకరి భూభాగంలోకి ప్రవేశించడానికి అనుమతించే ఫ్రీ మూవ్‌మెంట్ రీజిమ్ (FMR) త్వరలో ముగియనుంది.
భారత్‌లోని మిజోరాం, మణిపూర్, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలు మియన్మార్‌తో 1,643 కిలోమీటర్ల పొడవైన సరిహద్దును పంచుకుంటున్నాయి. ఈ రాష్ట్రాలన్నీ ప్రస్తుతం FMRని కలిగి ఉన్నాయి. ఎఫ్ఎంఆర్‌ని భారత్ యాక్ట్ ఈస్ట్ పాలసీలో భాగంగా 2018లో అమలు చేశారు. షా తన ప్రసంగంలో కాంగ్రెస్‌పై విమర్శలు చేశారు. కాంగ్రెస్ పాలనలో ప్రభుత్వ ఉద్యోగాలు పొందాలంటే లంచాలు ఇవ్వాల్సి వచ్చిందని.. బీజేపీ పాలనలో ఉపాధి కోసం ఒక్క రూపాయికూడా చెల్లించాల్సిన అవసరం రాలేదని పేర్కొన్నారు.
Updated Date - Jan 20 , 2024 | 05:02 PM