ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఆర్టీఐ కింద చీతాల ప్రాజెక్టు సమాచారం ఇవ్వలేం!

ABN, Publish Date - Jul 25 , 2024 | 06:15 AM

చీతాల ప్రాజెక్టు సమాచారం ఇవ్వడానికి మధ్యప్రదేశ్‌ అటవీ శాఖ నిరాకరించింది. వన్యప్రాణి సంరక్షణ కార్యకర్త అజయ్‌ దూబే... సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద

న్యూఢిల్లీ, జూలై 24: చీతాల ప్రాజెక్టు సమాచారం ఇవ్వడానికి మధ్యప్రదేశ్‌ అటవీ శాఖ నిరాకరించింది. వన్యప్రాణి సంరక్షణ కార్యకర్త అజయ్‌ దూబే... సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద చేసిన దరఖాస్తును తోసిపుచ్చింది. ఈ సమాచారం వెల్లడిస్తే దేశ భద్రత, విదేశాలతో సంబంధాలపై ప్రభావం పడుతుందని పేర్కొంది. నమీబియా నుంచి తెచ్చిన 8 చీతాలను 2022 సెప్టెంబరు 17న ప్రధాని మోదీ చేతులమీదుగా మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్‌ పార్కులో విడిచిపెట్టారు. తర్వాత గత ఏడాది ఫ్రిబవరిలో అధికారులు దక్షిణాఫ్రికా నుంచి తీసుకొచ్చిన మరో 12 చీతాలను విడుదల చేశారు. చీతాలు వరుసగా చనిపోతుండడంతో ఈ ప్రాజెక్టుపై తీవ్ర విమర్శలు వచ్చాయి.

Updated Date - Jul 25 , 2024 | 06:15 AM

Advertising
Advertising
<