ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Chennai: చెన్నైని కప్పేసిన పొగమంచు.. 88 విమాన సర్వీసులకు అంతరాయం

ABN, Publish Date - Jan 17 , 2024 | 09:10 AM

చెన్నై(Chennai) నగరాన్ని పొగమంచు కమ్మేసింది. దీంతో 88 విమాన సర్వీసుల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. 12 విమాన సర్వీసులు ల్యాండింగ్‌ చేయలేక పోయారు.

అడయార్‌(చెన్నై): చెన్నై(Chennai) నగరాన్ని పొగమంచు కమ్మేసింది. దీంతో 88 విమాన సర్వీసుల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. 12 విమాన సర్వీసులు ల్యాండింగ్‌ చేయలేక పోయారు. దీంతో ఆ విమాన ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. భోగి పండుగతో పాటు సోమవారం కూడా ఈ పరిస్థితి ఉత్పన్నమైంది. మంగళవారం ఉదయం 7 నుంచి 9 గంటల ప్రాంతంలో పొగమంచు నగరాన్ని దట్టంగా కమ్మేసింది. విమానాశ్రయం దగ్గర కూడా ఇదే పరిస్థితి. దీంతో లండన్‌, సింగపూర్‌, కౌలాలంపూర్‌, కొలంబో, కువైట్‌, మస్కట్‌, ఢిల్లీ, కోల్‌కత్తా, ముంబై, పుణె, సెంగాడు ప్రాంతాలకు వెళ్లే 12 విమాన సర్వీసులను హైదరాబాద్‌, బెంగళూరు, తిరువనంతపురం, తిరుచ్చి, కోయంబత్తూరు విమానాశ్రయాలకు దారి మళ్లించారు. ఇదేవిధంగా దేశంలోని వివిధ ప్రాంతాలతో పాటు విదేశాల నుంచి చెన్నైకి రావాల్సిన దాదాపు 40కు పైగా విమాన సర్వీసులు కొన్ని గంటల పాటు ఆల స్యంగా వచ్చాయి. ఢిల్లీ, ముంబై, శ్రీలంకకు నడిపే 8 విమానాలను సోమవారం రద్దు చేశారు.

Updated Date - Jan 17 , 2024 | 09:10 AM

Advertising
Advertising