ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Chennai: ‘జయ’ నగలన్నింటినీ ప్రభుత్వానికి అప్పగించండి

ABN, Publish Date - Jan 24 , 2024 | 12:03 PM

దివంగత ముఖ్యమంత్రి జయలలిత(Jayalalitha)కు చెందిన బంగారు నగలను తమిళనాడు రాష్ట్రప్రభుత్వానికి అప్పగించాలని బెంగళూరు ప్రత్యేక కోర్టు ఆదేశించింది.

- బెంగళూరు ప్రత్యేక కోర్టు ఆదేశం

అడయార్‌(చెన్నై): దివంగత ముఖ్యమంత్రి జయలలిత(Jayalalitha)కు చెందిన బంగారు నగలను తమిళనాడు రాష్ట్రప్రభుత్వానికి అప్పగించాలని బెంగళూరు ప్రత్యేక కోర్టు ఆదేశించింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా జయలలిత ఉన్న సమయంలో ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారన్న కేసులో బెంగళూరులోని ప్రత్యేక కోర్టులో పదేళ్లపాటు విచారణ సాగింది. ఈ కేసులో 2015లో ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి జాన్‌ మైఖేల్‌ డి కున్హా సంచలన తీర్పును వెలువరిస్తూ, జయలలిత, శశికళ, సుధాకరన్‌ను దోషులుగా తేల్చారు. ఆ తర్వాత హైకోర్టు, సుప్రీంకోర్టులలో అప్పీల్‌ చేశారు. చివరకు సుప్రీంకోర్టు జయలలితతో పాటు దోషులందరికీ నాలుగేళ్ల జైలుశిక్ష విధించింది. అయితే, జయ మృతితో ఆమె మినహా మిగిలిన వారంతా శిక్షాకాలాన్ని పూర్తి చేశారు. ఈ కేసులో జయ నివాసంలో స్వాధీనం చేసుకున్న బంగారు ఆభరణాలు, చెప్పులు, చీరలు, వాచీలు ఇలా ఖరీదైన వస్తువులన్నీ కర్ణాటక రాష్ట్ర ఖజానాలో భద్రపరిచారు. వీటన్నింటినీ తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించాలని కోరుతూ బెంగళూరుకు చెందిన ఆర్టీఐ కార్యకర్త టి.నరసింహమూర్తి... బెంగళూరు ప్రత్యేక కోర్టు(Bangalore Special Court)లో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ న్యాయమూర్తి మోహన్‌ సమక్షంలో విచారణకు వచ్చింది. ఇరువర్గాల వాదనలు ఆలకించిన న్యాయమూర్తి తీర్పును వెలువరించారు. అక్రమాస్తుల కేసులో ప్రధాన ముద్దాయిగా ఉన్న జయ నివాసంలో స్వాధీనం చేసుకున్న అన్ని రకాల ఆభరణాలు, ఇతర సామాగ్రిని తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించాలని ఆదేశించారు. అలాగే, జయకు చెందిన స్థిర, చర ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయో తమిళనాడు రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ గుర్తించి ఆ వివరాలను తమిళనాడు ప్రభుత్వంతో పాటు కోర్టుకు తెలియజేయాలని ఉత్తర్వులు జారీచేశారు. అలాగే, బెంగళూరు ప్రత్యేక కోర్టులో జరిగిన ఈ కేసు విచారణ ఖర్చుల కోసం కర్ణాటక ప్రభుత్వానికి తమిళనాడు ప్రభుత్వం రూ.5కోట్లు చెల్లించాలని న్యాయమూర్తి మోహన్‌ ఆదేశించారు.

Updated Date - Jan 24 , 2024 | 12:03 PM

Advertising
Advertising