ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Kedarnath: గాలిలో హెలికాఫ్టర్ చక్కర్లు.. తృటిలో ప్రాణాలతో బయటపడ్డ భక్తులు

ABN, Publish Date - May 24 , 2024 | 07:21 PM

హెలికాఫ్టర్‌లో కేదార్‌నాథ్ బయలుదేరిన ఆరుగురు భక్తులు తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. కేదార్‌నాథ్‌లోని కేదారేశ్వరుడిని దర్శించుకునేందుకు ఆరుగురు భక్తులు శుక్రవారం సిర్సా నుంచి కేధార్‌నాథ్‌కు హెలికాఫ్టర్‌లో బయలుదేరారు.

డెహ్రాడున్, మే 24: హెలికాఫ్టర్‌లో కేదార్‌నాథ్ బయలుదేరిన ఆరుగురు భక్తులు తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. కేదార్‌నాథ్‌లోని కేదారేశ్వరుడిని దర్శించుకునేందుకు ఆరుగురు భక్తులు శుక్రవారం సిస్రీ నుంచి కేధార్‌నాథ్‌కు హెలికాఫ్టర్‌లో బయలుదేరారు.

Yadadri: భక్తులకు గుడ్ న్యూస్.. స్వామి వారి సేవలు ఇకపై ఆన్‌లైన్‌లో..


అయితే దాదాపు కేదార్‌నాథ్ సమీపంలోకి రాగానే.. హెలికాఫ్టర్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. దాంతో గాలిలో హెలికాఫ్టర్ వేగంగా చక్కర్లు కొట్టింది. ఆ క్రమంలో పైలెట్‌ చాకచక్యంగా వ్యవహరించి.. హెలికాఫ్టర్‌ను బహిరంగ ప్రదేశంలో దింపేశాడు. కేదార్‌నాథ్‌‌లోని హెలిపాడ్‌కు దాదాపు 100 మీటర్ల దూరంలో హెలికాఫ్టర్‌ను దింపాల్సి వచ్చింది.

Rajinikanth: రజనీకాంత్‌కు యూఏఈ గోల్డెన్ వీసా


ఈ ఘటనలో ఆరుగురు భక్తులతోపాటు పైలెట్‌కు ఎటువంటి గాయాలు కాలేదు. కానీ ఈ ఘటనలో హెలికాఫ్టర్‌ వెనుక భాగం కొద్దిగా దెబ్బతింది. ఈ ఘటనపై డీజీసీఏకు సమాచారం అందించారు. దీంతో ఈ ఘటనపై డీజీసీఏ విచారణ జరిపేందుకు సమాయత్తమైనట్లు సమాచారం. మే 10వ తేదీన కేదారనాథ్ దేవాలయం తలుపులు తెరిచారు. దీంతో కేదారేశ్వరుడిని దర్శించుకొనేందుకు భక్తులు పోటెత్తుతున్నారు.

Read Latest News and National News here

Updated Date - May 24 , 2024 | 07:30 PM

Advertising
Advertising