ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Delhi: దాని నుంచి కోలుకోడానికి ప్రధాని మోదీ నా వెన్నంటే నిలిచారు.. చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ ఆసక్తికర వ్యాఖ్యలు

ABN, Publish Date - Feb 23 , 2024 | 04:01 PM

కరోనా(Covid 19) విపత్తు ఎన్నో కుటుంబాల్లో తీరని విషదాన్ని మిగిల్చిన విషయం విదితమే. పేద, మధ్య తరగతి, ధనిక ఇలా.. ఎలాంటి తారతమ్యాలు లేకుండా అందరినీ ఈ వైరస్ చుట్టుముట్టింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్(CJI Chandrachud) సైతం కరోనా బారిన పడ్డారు.

ఢిల్లీ: కరోనా(Covid 19) విపత్తు ఎన్నో కుటుంబాల్లో తీరని విషదాన్ని మిగిల్చిన విషయం విదితమే. పేద, మధ్య తరగతి, ధనిక ఇలా.. ఎలాంటి తారతమ్యాలు లేకుండా అందరినీ ఈ వైరస్ చుట్టుముట్టింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్(CJI Chandrachud) సైతం కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఓ వేదికపై ప్రస్తావించారు. సుప్రీంకోర్టు ప్రాంగణంలో శుక్రవారం ఆయుష్ హోలిస్టిక్ వెల్‌నెస్ సెంటర్‌ని ఆయన కోర్టు సిబ్బందితో కలిసి ప్రారంభించారు.

అనంతరం సీజేఐ మాట్లాడుతూ.. తాను కరోనా బారిన పడినప్పుడు ప్రధాని మోదీ స్వయంగా ఫోన్ చేసి జాగ్రత్తలు చెప్పినట్లు వివరించారు. "కరోనాకి విరుగుడుగా ఆయుర్వేదం ఎంతో చక్కగా పని చేస్తుంది. వైరస్ సోకినప్పుడు ప్రధాని మోదీ(PM Modi) నాకు ఫోన్ చేశారు. నా యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. చికిత్స విషయమై ఆయన ఓ ఆయుష్ వైద్యుడితో ఫోన్ మాట్లాడించారు. ఆయన మందులు పంపిస్తాడని.. ఆయుష్ ఔషధాలు కరోనాకు చక్కగా ఉపయోగపడతాయని ప్రధాని అన్నారు. వైరస్ నుంచి కోలుకునేవరకు మోదీ నా వెన్నంటే నిలిచారు. వైద్యుడు సూచించిన మందులు వాడాక కొద్దీ రోజుల్లోనే కరోనా నుంచి విముక్తి పొందాను. వాటి పనితీరును చూసి ఆశ్చర్యపోయా. దీంతో కొవిడ్ వచ్చిన మూడుసార్లూ నేను అల్లోపతి వైద్యమే తీసుకోలేదు. ఆయుర్వేదం గొప్పతనం అప్పుడు తెలిసొచ్చింది" అని చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ చెప్పారు.


ఆరోగ్యం ఎంతో ముఖ్యం..

ప్రతి మనిషికి ఆరోగ్యం ఎంతో ముఖ్యమని చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ అన్నారు. "నేను 6 నెలలుగా శాకాహారాన్ని తీసుకుంటున్నా. యోగాను జీవనశైలిలో భాగం చేసుకున్నా. పూర్తి ఆరోగ్యంగా ఉండేందుకే కఠినమైన ఆహార నియమాలు పాటిస్తున్నా. యోగా కోసం ప్రతి రోజు ఉదయం 3.30 గంటలకు మేల్కొంటాను. సంప్రదాయ ఆయుర్వేదం వల్ల కలిగే ప్రయోజనాలను వివరిస్తున్న వైద్యులకు ధన్యవాదాలు. ఆయుర్వేదంపై ప్రజల్లో మరింత అవగాహన రావాల్సిన అవసరం ఉంది" అని జస్టిస్ చంద్రచూడ్ వ్యాఖ్యానించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Feb 23 , 2024 | 04:49 PM

Advertising
Advertising