ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Nitish Kumar: గవర్నర్‌తో నితీష్ అనూహ్య సమావేశం... ఊపందుకున్న ఊహాగానాలు

ABN, Publish Date - Jan 23 , 2024 | 04:42 PM

బీహార్‌ రాజకీయాల్లో మరోసారి అలజడి చోటుచేసుకోనుందా? జేడీయూ చీఫ్, ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్ అనూహ్యంగా గవర్నర్‌ను మంగళవారంనాడు కలుసుకోవడం ఈ అనుమానాలకు తావిస్తోంది. ఆర్జేడీకి ఉద్వాసన చెప్పి బీజేపీతో చేతులు కలిపే అవకాశాలున్నాయనే ఊహాగానాలు వెలువడుతున్నాయి.

పాట్నా: బీహార్‌ రాజకీయాల్లో మరోసారి అలజడి చోటుచేసుకోనుందా? జేడీయూ చీఫ్, ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్ (Nitish Kumar) అనూహ్యంగా గవర్నర్‌ను మంగళవారంనాడు కలుసుకోవడం ఈ అనుమానాలకు తావిస్తోంది. ఎలాంటి ముందస్తు ప్లానింగ్ లేనప్పటికీ గవర్నర్‌ను నితీష్ కలుసుకున్నట్టు తెలుస్తోంది. గవర్నర్‌తో ఆయన 'రహస్య' మంతనాలు సాగించినట్టు చెబుతున్నారు. ప్రస్తుతం ప్రభుత్వంలో భాగస్వా్మ్య పార్టీగా ఉన్న ఆర్జేడీకి ఉద్వాసన చెప్పి బీజేపీతో చేతులు కలిపే అవకాశాలున్నాయంటూ ఊహాగానాలు వెలువడుతున్న నేపథ్యంలో గవర్నర్‌ను నితీష్ కలుసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. జేడీయూ నుంచి ఎలాంటి సానుకూల ప్రతిపాదన వచ్చినా తాము పరిశీలించగలమని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా సహా పలువురు బీజేపీ నేతలు ఇప్పటికే సంకేతాలు ఇచ్చారు.


కాగా, జేడీయూ-ఆర్డేడీ మధ్య విభేదాలు తలెత్తాయన్న ఊహాగానాల నేపథ్యంలో లాలూ ప్రసాద్ యాదవ్, తేజస్వి యాదవ్ గత వారంలో నితీష్‌ను ఆయన నివాసంలో కలుసుకున్నారు. ఆర్జేడీ విషయంలో నితీష్ కొద్దికాలంగా అసంతృప్తితో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. 'ఇండియా' బ్లాక్ కన్వీనర్ పదవికి తనను ఆర్జేడీ సపోర్ట్ చేయలేదనే భావనతో నితీష్ ఉన్నారని చెబుతున్నారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఆర్జేడీ ఎక్కువ సీట్లలో పోటీకి ఆయన ఎంతమాత్రం సముఖంగా లేరని, ఆర్జేడీతో సీట్ల షేరింగ్ వ్యవహారం తలనొప్పిగా మారే అవకాశాలున్నట్టు నితీష్ అనుమానిస్తున్నారని చెబుతున్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమిలో భాగస్వామిగా ఉన్న జేడీయూ 16 సీట్లు సాధించుకుంది. రాబోయే ఎన్నికల్లో సైతం అంతకంటే తక్కువ సీట్లలో పోటీకి జేడీయూ విముఖంగా ఉందంటున్నారు. ఆర్జేడీ విషయానికి వస్తే గతంలో ఒక్క లోక్‌సభ సీటు గెలుచుకోనప్పటికీ, అసెంబ్లీలో ప్రస్తుతం తమకున్న సంఖ్యా బలం దృష్ట్యా ఎక్కువ లోక్‌సభ సీట్ల కోసం డిమాండ్ చేయవచ్చని అంచనా వేస్తున్నారు. అయితే, జేడీయూ, ఆర్జేడీ మధ్య ఎలాంటి ఇబ్బందులు లేవని, గౌరవప్రదంగా సీట్ల షేరింగ్ ఉంటుందని ఇటీవల లాలూతో సహా నితీష్‌ను కలిసిన తేజస్వి యాదవ్ ప్రకటించారు. మరోవైపు, తేజస్వి యాదవ్ లేకుండా పలు అడ్వర్‌టైజ్‌మెంట్లు, వీడియోలను జేడీయూ ప్రచారంలోకి తీసుకురావడంపై ఆర్జేడీ గుర్రుమంటున్నట్టు చెబుతున్నారు. ఈ పరిణామాలన్నింటినీ నిశితంగా గమనిస్తున్న రాజకీయ పండితులు లోక్‌సభ ఎన్నికలకు ముందు నితీష్ ఏదో ఒక కీలక నిర్ణయంతో ముందుకు వచ్చే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు.

Updated Date - Jan 23 , 2024 | 04:42 PM

Advertising
Advertising