ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

I.N.D.I.A. bloc: 'ఇండియా' కూటమిలో నితీష్‌కు కీలక పదవి.. కాంగ్రెస్ యోచన..

ABN, Publish Date - Jan 01 , 2024 | 04:31 PM

లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఓటమే లక్ష్యంగా ఏర్పాటైన ఇండియా బ్లాక్‌లో తొలి కీలక పరిణామం చోటుచేసుకోనుంది. కూటమిలో కీలక బాధ్యతలను బీహార్ సీఎం, జేడీయూ చీఫ్‌ నితీష్‌ కుమర్ కు అప్పగించనున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆసక్తికరంగా కొద్ది రోజుల క్రితం వరకూ కూటమి తీరుపై అసంతృప్తితో ఉన్నట్టు వార్తలు వచ్చాయి.

న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఓటమే లక్ష్యంగా ఏర్పాటైన ఇండియా (I.N.D.I.A.) బ్లాక్‌లో తొలి కీలక పరిణామం చోటుచేసుకోనుంది. కూటమిలో కీలక బాధ్యతలను బీహార్ సీఎం, జేడీయూ చీఫ్‌ నితీష్‌ కుమర్(Nitish Kumar)కు అప్పగించనున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆసక్తికరంగా కొద్ది రోజుల క్రితం వరకూ కూటమి తీరుపై అసంతృప్తితో ఉన్నట్టు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో నితీష్ కుమార్‌ను కూటమి కన్వీనర్‌గా చేసే విషయాన్ని కాంగ్రెస్ సీరియస్‌గా పరిశీలిస్తోంది. ఇది జనతా దళ్ (యూనైటెడ్) చిరకాల డిమాండ్‌గా కూడా ఉంది.


నితీష్‌కు కూటమి కన్వీనర్ పగ్గాలు అప్పగించేందుకు కాంగ్రెస్ పార్టీ ఆయనతో సంప్రదింపులను ముమ్మరం చేసినట్టు తెలుస్తోంది. కుల ఆధారిత లెక్కలు, రిజర్వేషన్ అంశాన్ని ప్రజల్లోకి తీసుకు వెళ్లే ముందు కాంగ్రెస్ తమను ముందుగా సంప్రదించ లేదని నితీష్ ఇటీవల ఆ పార్టీపై గుర్రుమన్నారు.


జేడీయూ పగ్గాలు..

జేడీయూలో ఎలాంటి చీలకలకు ఆస్కారం లేకుండా నితీష్ కుమార్ ఇటీవల వేగంగా పావులు కదిపారు. పార్టీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ సమావేశంలో జేడీయూ అధ్యక్ష పదవికి లలన్ సింగ్ రాజీనామా చేయడం, ఆ వెంటనే జేడీయూ చీఫ్ పగ్గాలు నితీష్ చేపట్టడం చకచకా జరిగిపోయాయి. కీలకమైన లోక్‌సభ ఎన్నికలు తరుముకొస్తు్న్న వేళ పార్టీ దిగ్గజమైన నితీష్‌కుమార్ అధ్యక్ష పగ్గాలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆ పార్టీ ప్రముఖులు నిశ్చతాభిప్రాయం వ్యక్తం చేశారు. అదీగాకుండా, లలన్ సింగ్ పనితీరు, నితీష్‌ను కీలకవ్యక్తిగా ఫోకస్ చేసే విషయంలో ఇండియా కూటమి నేతలతో సరైన రీతిలో ఆయన వ్యవహరించకపోవడంపై కూడా ఆ పార్టీ నేతలు అసంతృప్తితో ఉన్నారు. బీహార్‌లోని అధికార కూటమిలో భాగస్వామిగా ఉన్న ఆర్జేడీకి లలన్ సింగ్ దగ్గరవుతున్నారనే సంకేతాలు కూడా వెలువడ్డాయి. ఈ క్రమంలో లలన్ సింగ్ రాజీనామా చేయడం, పార్టీ చీఫ్ పగ్గాలు నితీష్ దక్కించుకోవడం ద్వారా పార్టీపై తనకున్న పట్టును నితీష్ మరోసారి నిరూపించుకున్నారు.

Updated Date - Jan 01 , 2024 | 04:35 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising