ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Tamilnadu: ఉదయ నిధి స్టాలిన్‌కు కోర్టులో బిగ్ రిలీఫ్.. ఏ కేసులో అంటే

ABN, Publish Date - Mar 06 , 2024 | 04:50 PM

సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్(Udhayanidhi Stalin) చేసిన వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఉపశమనం లభించింది. సనాతన ధర్మంపై ఉదయనిధితోపాటు మరో ఇద్దరు డీఎంకే నేతలు చేసిన వ్యాఖ్యలపై మద్రాస్ హైకోర్టు(Madras High Court)లో కొందరు పిటిషన్ దాఖలు చేశారు.

చెన్నై: సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్(Udhayanidhi Stalin) చేసిన వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఉపశమనం లభించింది. సనాతన ధర్మంపై ఉదయనిధితోపాటు మరో ఇద్దరు డీఎంకే నేతలు చేసిన వ్యాఖ్యలపై మద్రాస్ హైకోర్టు(Madras High Court)లో కొందరు పిటిషన్ దాఖలు చేశారు. వారు చేసిన వ్యాఖ్యలకుగానూ నేతల సభ్యత్వం రద్దు చేయాలని పిటిషనర్‌లు వాదించారు. ఉదయనిధి స్టాలిన్‌తో పాటు మంత్రి పీకే శేఖర్ బాబు, డీఎంకే ఎంపీ రాజా చట్టసభ సభ్యత్వాలు రద్దు చేయాలని పిటిషనర్లు కోరారు.

విచారించిన మద్రాస్ హైకోర్టు బుధవారం పిటిషన్‌లను కొట్టేసింది. ఉదయనిధి వ్యాఖ్యలపై గతం దేశంలోని అనేక పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఆయనకు వ్యతిరేకంగా చాలా మంది నిరసనలూ తెలిపారు. కొందరు సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేశారు. మార్చి 4న ఈ పిటిషన్‌పై విచారించిన సుప్రీం ఉదయనిధి వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓ మంత్రి హోదాలో ఉంటూ ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడమేంటని ప్రశ్నించింది. అలా మాట్లాడటం సరికాదని హితవు పలికింది.


ఉదయనిధి ఏమన్నారంటే..

గతేడాది జరిగిన సనాతన నిర్మూలన కాన్ఫరెన్స్‌లో భాగంగా ఉదయనిధి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మం అనేది సామాజిక న్యాయం, సమానత్వానికి వ్యతిరేకంగా ఉంటుందని.. కొన్నింటిని వ్యతిరేకించి ఊరుకోకూడదని.. వాటిని నిర్మూలించాలని పిలుపునిచ్చారు. డెంగ్యూ, మలేరియా, దోమలు, కరోనా వంటి వాటిని వ్యతిరేకిస్తే సరిపోదని పూర్తిగా నిర్మూలించాలని అన్నారు. ఆయన వ్యాఖ్యలపై తమిళ నాడు బీజేపీ మండిపడింది. స్పందించిన ఉదయనిధి స్టాలిన్ ఘాటుగా రిప్లై ఇచ్చారు. బీజేపీ పంపే లీగల్ నోటీసులను ఎదుర్కోవడానికి తాను సిద్ధంగా ఉన్నానని తేల్చి చెప్పారు. ఈ వివాదం కాస్తా.. రాజకీయాలను హీటెక్కించి.. చివరికి సుప్రీం కోర్టు వరకు చేరింది.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 06 , 2024 | 04:52 PM

Advertising
Advertising