ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Swati Maliwal: స్వాతి మలివాల్ రాజీనామాను ఆమోదించిన సీఎం

ABN, Publish Date - Jan 06 , 2024 | 06:29 PM

డీసీబ్ల్యూ చీఫ్ స్వాతి మలివాల్ రాజీనామాను ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శనివారంనాడు ఆమోదించారు. దానిని వెంటనే లిఫ్టెనెంట్ గవర్నర్‌ ఆమోదానికి ఆయన పంపారు. ఢిల్లీ నుంచి రాజ్యసభ ఎన్నికల్లో ఆప్ అభ్యర్థిగా మలివాల్ ఉన్నారు. రాజ్యసభకు తన నామినేషన్ పత్రాన్ని సోమవారంనాడు ఆమె సమర్పించనున్నారు.

న్యూఢిల్లీ: డీసీబ్ల్యూ చీఫ్ స్వాతి మలివాల్ (Swati Maliwal) రాజీనామాను ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvidnd Kejriwal) శనివారంనాడు ఆమోదించారు. దానిని వెంటనే లిఫ్టెనెంట్ గవర్నర్‌ ఆమోదానికి ఆయన పంపారు. ఢిల్లీ నుంచి రాజ్యసభ ఎన్నికల్లో ఆప్ అభ్యర్థిగా మలివాల్ ఉన్నారు. రాజ్యసభకు తన నామినేషన్ పత్రాన్ని సోమవారంనాడు ఆమె సమర్పించనున్నారు.


స్వాతి మలివాల్‌ను రాజ్యసభకు 'ఆప్' నామినేట్ చేయగా, సంజయ్ సింగ్, నారాయణ్ దాస్ గుప్తాలను రెండోసారి నామినేట్ చేసింది. కేజ్రీవాల్ అధ్యక్షతన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) ఈ ముగ్గురి నామినేషన్లను శుక్రవారంనాడు ప్రకటించింది. సంజయ్ సింగ్, సుశీల్ కుమార్ గుప్తా, నారాయణ్ దాస్ గుప్తాల ఆరేళ్ల పదవీకాలం జనవరి 27తో ముగియనుంది. ఆప్ హర్యానా విభాగం అధ్యక్షుడుగా ఉన్న సుశీల్ కుమార్ స్థానంలో మలివాల్‌కు ఈసారి రాజ్యసభ అభ్యర్థిగా 'ఆప్ అవకాశం ఇచ్చింది. ఈ మూడు రాజ్యసభ స్థానాలు భర్తీకి ఎన్నికలు అనివార్యమైతే జనవరి 19న నిర్వహిస్తారు. నామినేషన్ల దాఖలు గడువు జనవరి 9తో ముగుస్తుంది. జనవరి 10న నామినేషన్ల పరిశీలన, జనవరి 12 నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. 70 మంది సభ్యులున్న ఢిల్లీ అసెంబ్లీలో ఆప్‌కు 62 మంది ఎమ్మెల్యేలు బలం ఉండగా, బీజేపీకి 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.

Updated Date - Jan 06 , 2024 | 06:29 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising