ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Delhi: తగ్గుముఖం పట్టిన శీతల గాలులు.. పాఠశాలల పునఃప్రారంభం ఎప్పుడంటే!

ABN, Publish Date - Jan 07 , 2024 | 08:07 AM

దేశ రాజధాని ఢిల్లీ(Delhi)లో శీతల గాలుల ప్రభావంతో ఇటీవల అక్కడి ప్రభుత్వం పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. సెలవుల గడువు ముగియండంతో మరోసారి గడువు పొడగిస్తున్నట్లు ఇటీవల మరో ఉత్తర్వు వెలువరించింది. అయితే ఈ ఉత్తర్వులను రద్దు చేస్తూ ఢిల్లీ విద్యా డైరెక్టరేట్ శనివారం రాత్రి నిర్ణయం వెలువరించింది.

ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ(Delhi)లో శీతల గాలుల ప్రభావంతో ఇటీవల అక్కడి ప్రభుత్వం పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. సెలవుల గడువు ముగియండంతో మరోసారి గడువు పొడగిస్తున్నట్లు ఇటీవల మరో ఉత్తర్వు వెలువరించింది. అయితే ఈ ఉత్తర్వులను రద్దు చేస్తూ ఢిల్లీ విద్యా డైరెక్టరేట్ శనివారం రాత్రి నిర్ణయం వెలువరించింది. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో శీతాకాలపు సెలవులను వాతావరణ పరిస్థితుల కారణంగా జనవరి 10 వరకు పొడిగించినట్లు అంతకుముందు డైరెక్టరేట్ పేర్కొంది.

ఈ క్రమంలో కొంత పొరపాటు జరిగిందని ఢిల్లీ ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. "శీతాకాల విరామాన్ని పొడిగించే ఉత్తర్వు తప్పుగా జారీ అయింది. ఆర్డర్ వెంటనే ఉపసంహరించుకున్నాం" అని చెప్పారు. సెలవులు శనివారంతో ముగియనుండగా, సోమవారం తరగతులు పునఃప్రారంభం కానున్నాయి. ఢిల్లీ - ఎన్సీఆర్ పరిధిలో ఇటీవల శీతలగాలుల ప్రభావం పెరిగింది. దీంతో వైద్యాధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు.

Updated Date - Jan 07 , 2024 | 08:08 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising