ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

రైలెక్కాలంటే సూటే కావాలా?

ABN, Publish Date - Feb 27 , 2024 | 03:48 AM

ఈయన ఓ వృద్ధ రైతు. ప్రయాణం నిమిత్తం నమ్మమెట్రోకు అనుబంధమైన బెంగళూరు రాజాజీనగర్‌ మెట్రోస్టేషన్‌కు సోమవారం వచ్చాడు.

మెట్రోలో రైతుకు అవమానంపై నెటిజన్ల ఫైర్‌

బెంగళూరు, ఫిబ్రవరి 26: ఈయన ఓ వృద్ధ రైతు. ప్రయాణం నిమిత్తం నమ్మమెట్రోకు అనుబంధమైన బెంగళూరు రాజాజీనగర్‌ మెట్రోస్టేషన్‌కు సోమవారం వచ్చాడు. అయితే, అక్కడి సెక్యూరిటీ సిబ్బందికి ఈయన వేషధారణ నచ్చలేదు. మాసిపోయిన దుస్తులు వేసుకుని వచ్చాడని స్టేషన్‌లోకి వెళ్లేందుకు అనుమతించకుండా అడ్డుకుని అవమానించారు. ఈ దృశ్యాలను ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్టు చేశాడు. మెట్రో అధికారులపై నెటిజన్లు విరుచుకుపడ్డారు. వీఐపీలు, సూటుబూటుతో వచ్చేవారే మెట్రోలో ప్రయాణించాలా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటన జరిగిన అరగంటలోనే విషయం పాకిపోవడంతో వెంటనే మెట్రో ఉన్నతాధికారులు స్పందించారు. రాజాజీనగర్‌ మెట్రోస్టేషన్‌ సెక్యూరిటీ సిబ్బందిని విధుల నుంచి తొలగించారు.

Updated Date - Feb 27 , 2024 | 06:52 AM

Advertising
Advertising