EC: పిల్లలను దానికి ఉపయోగించుకుంటే చర్యలే.. పార్టీలకు ఈసీ హెచ్చరిక
ABN, Publish Date - Feb 05 , 2024 | 02:09 PM
దేశ వ్యాప్తంగా త్వరలో లోక్ సభ ఎన్నికలు(Parliament Elections 2024) జరగనున్న వేళ భారత ఎన్నికల సంఘం అందుకు తగిన ఏర్పాట్లు చేస్తోంది.
ఢిల్లీ: దేశ వ్యాప్తంగా త్వరలో లోక్ సభ ఎన్నికలు(Parliament Elections 2024) జరగనున్న వేళ భారత ఎన్నికల సంఘం అందుకు తగిన ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా సోమవారం రాజకీయ పార్టీల(Political Parties)కు పలు కీలక సూచనలు చేసింది. పార్టీలు ఎన్నికల్లో తమ ప్రచారాలకు పిల్లలను ఉపయోగించుకోవద్దని సూచించింది. పోస్టర్లు, కర పత్రాల పంపిణీ, నినాదాలతో ఎక్కడైనా పిల్లలను ప్రచారంలో వాడుకున్నట్లు తెలిస్తే చర్యలు తప్పవని హెచ్చరించింది.
ఈ మధ్య రాజకీయ నేతలు పిల్లలను తమ పార్టీల ప్రచారం కోసం వాడుకుంటున్న తీరు కనిపిస్తోందని.. ఈ పరిణామం మంచిది కాదని తెలిపింది. రాబోయే ఎన్నికల్లో ప్రజాస్వామ్య విలువలను కాపాడుకోవడంలో అధికారులు, పార్టీ నేతలు క్రియాశీల భాగస్వాములు కావాలని కోరారు.
Updated Date - Feb 05 , 2024 | 03:56 PM