ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Kochi: కేరళలో రూ.212 కోట్ల కుంభకోణం.. 55 బ్యాంక్ అకౌంట్లు ఫ్రీజ్ చేసిన అధికారులు

ABN, Publish Date - Jan 27 , 2024 | 10:17 AM

పిరమిడ్ స్కీములు నడుపుతూ, ఆన్‌లైన్ రిటైల్ స్టోర్ కిరాణ సామగ్రిని విక్రయించే ముసుగులో కోట్ల రూపాయలను ప్రజల నుంచి సేకరించి దోచుకున్న కేసును ఈడీ అధికారులు ఛేదించారు. కేరళలో ఇటీవల వెలుగులోకి వచ్చిన కుంభకోణంలో సంచలన విషయాలు బయటపడుతున్నాయి.

కొచ్చి: పిరమిడ్ స్కీములు నడుపుతూ, ఆన్‌లైన్ రిటైల్ స్టోర్ కిరాణ సామగ్రిని విక్రయించే ముసుగులో కోట్ల రూపాయలను ప్రజల నుంచి సేకరించి దోచుకున్న కేసును ఈడీ అధికారులు ఛేదించారు. కేరళలో ఇటీవల వెలుగులోకి వచ్చిన కుంభకోణంలో సంచలన విషయాలు బయటపడుతున్నాయి.

హైరిచ్ ఆన్‌లైన్ షాప్ ప్రైవేట్ లిమిటెడ్ యజమాని కేడీ ప్రతాపన్, శ్రీనా ప్రతాపన్‌లు ఈ కేసులో కీలక నిందితులుగా ఉన్నారు. ఈ దంపతులు మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో రంగంలోకి దిగిన ఈడీ అధికారులు వారి ఇళ్లు, ఆఫీసుల్లో జనవరి 23, 24 తేదీల్లో సోదాలు చేశారు. ఈ క్రమంలో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. దంపతుల పేరు మీద ఏకంగా 55 బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయని.. అందులో అక్షరాల రూ.212 కోట్లు ఉన్నట్లు తేలింది.


ఆ సొమ్మంతా ప్రజల నుంచి మోసపూరితంగా వసూలు చేసినవిగా గుర్తించారు. అధిక రాబడులు ఇస్తామని చెప్పి డిపాజిట్లు తీసుకున్నారని పోలీసులు తెలిపారు. నిందితులిద్దరిపై అన్‌రెగ్యులేటెడ్ డిపాజిట్ స్కీమ్ (BUDS) చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ చట్టం ప్రకారం వారి స్థిర, చరాస్తులను జప్తు చేయాలని త్రిసూర్ కలెక్టర్ ఆదేశించారు. 40% రిటర్న్‌లు ఇస్తామని చెప్పి సేకరించిన డబ్బును నాలుగు ప్రైవేట్‌ బ్యాంకుల్లోని 20 ఖాతాల్లో జమ చేసినట్లు దర్యాప్తు అధికారులు తెలిపారు.

హైరిచ్ దాదాపు 70 షెల్ కంపెనీలను కలిగి ఉందని, వాటిలో 14 త్రిస్సూర్‌లో ఉన్నట్లు వివరించారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద నమోదైన కేసుల విచారణకు ముందస్తు బెయిల్‌ను కోరుతూ ప్రతాపన్‌ దంపతులు కోర్టును ఆశ్రయించారు. ఈ కేసును జనవరి 25న విచారించాల్సి ఉండగా.. న్యాయమూర్తి నివేదిక కోరడంతో, విచారణను జనవరి 30కి వాయిదా వేసినట్లు ED స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సంతోష్ తెలిపారు.

Updated Date - Jan 27 , 2024 | 10:18 AM

Advertising
Advertising