Gurpatwant Singh Pannun: ఖలిస్థానీ ఉగ్రవాది హత్యకు కుట్రలో బిగ్ ట్విస్ట్.. భారత 'రా' అధికారిపై అమెరికా అభియోగాలు..
ABN, Publish Date - Oct 18 , 2024 | 12:50 PM
. ఖలిస్తానీ ఉగ్రవాది పన్నూ హత్య కుట్రకు వికాస్ యాదవ్ నేతృత్వం వహించినట్లు అమెరికా న్యాయశాఖ అభిమోగాల్లో వెల్లడించింది. న్యూయార్క్‌లోని న్యాయస్థానంలో ఈ కేసుకు సంబంధించి ఛార్జ్‌షీట్ దాఖలైంది. పన్నూ హత్యకు వికాస్ యాదవ్ కుట్ర చేశారని, కిరాయి వ్యక్తులను నియమించడం, పన్నూ హత్యకు ప్లాన్ చేసినట్లు అభియోగాలు..
ఖలిస్థానీ వేర్పాటువాది గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు కుట్ర కేసులో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్న అమెరికా భారత నిఘా విభాగం (రా) మాజీ అధికారి వికాస్ యాదవ్‌ను నిందితుడిగా పేర్కొంది. ఇప్పటికే ఈ కేసులో భారత్‌కు చెందిన నిఖిల్ గుప్తాను అమెరికా అరెస్ట్ చేసింది. ప్రస్తుతం అతడు అమెరికా జైల్లో ఉన్నారు. రా మాజీ అధికారిపై అమెరికా అభియోగాలు మోపడం తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఖలిస్తానీ ఉగ్రవాది పన్నూ హత్య కుట్రకు వికాస్ యాదవ్ నేతృత్వం వహించినట్లు అమెరికా న్యాయశాఖ అభిమోగాల్లో వెల్లడించింది. న్యూయార్క్‌లోని న్యాయస్థానంలో ఈ కేసుకు సంబంధించి ఛార్జ్‌షీట్ దాఖలైంది. పన్నూ హత్యకు వికాస్ యాదవ్ కుట్ర చేశారని, కిరాయి వ్యక్తులను నియమించడం, పన్నూ హత్యకు ప్లాన్ చేసినట్లు అభియోగాలు మోపింది. ప్రస్తుతం వికాస్ యాదవ్ పరారీలో ఉన్నారని పేర్కొంది. భారత విదేశీ ఇంటిలెజెన్స్ విభాగం (రా) నిర్వహించే కేబినెట్ సెక్రటేరియట్‌లో వికాస్ యాదవ్ పనిచేశారు. పన్నూ హత్యకు కుట్రపై అమెరికాలోని ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) తీవ్రంగా స్పందించింది. ఎఫ్‌బీఐ డైరెక్టర్ క్రిస్టోఫర్ స్పందిస్తూ.. అమెరికాలో నివాసం ఉంటూ.. రాజ్యాంగబద్ధంగా సంరక్షించిన హక్కులను పొందిన వారిపై ప్రతీకారం తీర్చుకోవడానికి హింసాత్మక చర్యలను లేదా ఇతర ప్రయత్నాలను ఎఫ్‌బీఐ సహించబోదన్నారు. తమ గడ్డపై పన్నూ హత్యకు కుట్ర జరిగిందని, దాన్ని తాము భగ్నం చేశామని గతేడాది మే మొదటి వారంలో అమెరికా ఆరోపించింది. భారత ప్రభుత్వ ఉద్యోగితో కలిసి పన్నూను హత్యకు నిఖిల్ గుప్తా కుట్ర పన్నారని అమెరికా ప్రాసిక్యూటర్లు ఆరోపించారు. పన్నూ హత్య పథకాన్ని అమలు చేయడానికి నిఖిల్ గుప్తాతో ఒప్పందం చేసుకున్నారని తెలిపారు.
నిఖిల్ గుప్తా అరెస్ట్..
పన్నూ హత్యకు కుట్ర కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిఖిల్ గుప్తా భారత్‌కు వస్తుండగా 2023 నవంబరులో చెక్ రిపబ్లిక్ రాజధాని పరాగ్వే విమానాశ్రయంలో అరెస్ట్ చేశారు. అక్కడ జైలులో ఉన్న నిఖిల్‌ను అమెరికాకు అప్పగించారు. ఇదే కేసులో భారత ప్రభుత్వానికి సైతం అమెరికా కోర్టు సమన్లు జారీ చేసింది. ఈ ఆరోపణలను భారత్ తీవ్రంగా ఖండించింది. దీనిపై విచారణకు స్వదేశంలో ఓ దర్యాప్తు కమిటీని నియమించింది. ఈ క్రమంలోనే ఇటీవల భారత అధికారుల బృందం అమెరికా విదేశాంగ శాఖ, న్యాయశాఖ అధికారులతో సమావేశమైంది.
భారత్ క్లారిటీ..
పన్నూ హత్యకు కుట్ర కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారి ప్రస్తుతం ప్రభుత్వంలో పనిచేయడం లేదని భారత్ తమకు వెల్లడించినట్లు అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మాథ్యూ మిల్లర్ తెలిపారు. మరోవైపు భారత దర్యాప్తు కమిటీ పర్యటన ముగిసిన తర్వాతే వికాస్ యాదవ్‌పై అమెరికా అభియోగాలు నమోదు చేసింది. పన్నూను హత్య చేస్తే లక్ష డాలర్లు ఇస్తానని నిఖిల్ గుప్తాతో ఒప్పందం చేసుకున్నారని, అడ్వాన్సుగా 15వేల డాలర్లు చెల్లించారని అమెరికా ఎఫ్‌బీఐ ఆరోపించింది. ఈ లావాదేవీలు న్యూయార్క్ సమీపంలో జరిగాయని అభియోగాల్లో తెలిపింది. ప్రస్తుతం వికాస్ యాదవ్ ఆచూకీ కోసం అమెరికా గాలిస్తోంది.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Read More Latest Telugu News Click Here
Updated Date - Oct 18 , 2024 | 12:50 PM