ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Breaking: రెచ్చిపోయిన మావోలు.. పోలీసు క్యాంప్‌పై దాడి.. ఐదుగురికి గాయాలు

ABN, Publish Date - Jan 30 , 2024 | 06:22 PM

మావోయిస్టులు తమ ఉనికిని చాటుకునేందుకు మరోసారి రెచ్చిపోయారు. ఛత్తీస్‌ఘడ్‌లోని బీజాపూర్ జిల్లా టేకులగూడెంలో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) క్యాంప్‌పై దాడికి తెగబడ్డారు. దీంతో.. పోలీసులు, మావోల మధ్య భీకర కాల్పులు చోటు చేసుకున్నాయి.

మావోయిస్టులు తమ ఉనికిని చాటుకునేందుకు మరోసారి రెచ్చిపోయారు. ఛత్తీస్‌ఘడ్‌లోని బీజాపూర్ జిల్లా టేకులగూడెంలో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) క్యాంప్‌పై దాడికి తెగబడ్డారు. దీంతో.. పోలీసులు, మావోల మధ్య భీకర కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో 13 మంది జవాన్లు తీవ్ర గాయాలవ్వడంతో.. వారిని చికిత్స నిమిత్తం ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా జగ్దల్‌పూర్ రిఫరల్ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన జవాన్లలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది.


కాగా.. మావోల దాడిచేసిన ఈ జవానుల భద్రతా శిబిరాన్ని ఈ మధ్యనే ఏర్పాటు చేయడం జరిగింది. ఎల్లప్పుడూ ఘర్షణలు చోటు చేసుకునే ఈ ప్రాంతంలో స్థానిక కమ్యూనిటీ శ్రేయస్సును మెరుగుపరిచేందుకు, వారికి ప్రాథమిక సౌకర్యాలు అందించాలన్న లక్ష్యంతో.. ఈ ఏడాది జనవరి 30వ తేదీన ఈ భద్రతా శిబిరాన్ని ప్రారంభించడం జరిగింది. అయితే.. ప్రారంభించిన కాసేపటికే మావోలు అదును చూసి ఈ దాడికి పాల్పడ్డారు. కాగా.. ఛత్తీస్‌గడ్‌లో పలు జిల్లాల్లో అధిక భాగం నక్సలైట్ల ప్రాబల్యం ఉన్నది. ఇందులో సుక్మా జిల్లా ఒకటి.

Updated Date - Jan 30 , 2024 | 06:22 PM

Advertising
Advertising