Jairam Ramesh : సాయం కాదు... ఆంధ్ర, బిహార్‌లకు మోసం
ABN, Publish Date - Jul 31 , 2024 | 06:01 AM
కేంద్ర బడ్జెట్‌లో ఏపీ, బిహార్‌లకు కేటాయించిన నిధులను కొన్నేళ్ల వరకు మోదీ ప్రభుత్వం ఇవ్వదని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ తెలిపారు. కేవలం నిధుల
బడ్జెట్‌లో పెట్టిన నిధులు ఇప్పట్లో ఇవ్వరు: జైరాం రమేశ్
న్యూఢిల్లీ, జూలై 30: కేంద్ర బడ్జెట్‌లో ఏపీ, బిహార్‌లకు కేటాయించిన నిధులను కొన్నేళ్ల వరకు మోదీ ప్రభుత్వం ఇవ్వదని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ తెలిపారు. కేవలం నిధుల ప్రకటన చేసి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రెండు రాష్ట్రాల్లోని ఎన్డీయే మిత్రపక్షాలను మోసగించారని మంగళవారం ‘ఎక్స్’లో ఆరోపించారు. ఈ కేటాయింపులు పతనమయ్యే బ్యాంకు ఇచ్చే పోస్ట్ డేటెడ్ చెక్కుల వంటివని ఎద్దేవాచేశారు. ఈ రెండు రాష్ట్రాలకు ఇచ్చిన ఆర్థిక ప్యాకేజీలతో కేంద్రానికి 20-30 వేల కోట్ల భారం పడుతుందని మీడియాలో వచ్చిన ఓ కథనాన్ని ఆయన షేర్ చేశారు. బడ్జెట్‌లో మిత్రపక్షాలను నిర్మల మోసం చేశారన్నారు.
Updated Date - Jul 31 , 2024 | 06:01 AM