Uttarakhand: ఆ గంగాజలం స్నానానికి తప్ప తాగడానికి పనికిరాదు: పీసీబీ
ABN, Publish Date - Dec 04 , 2024 | 01:13 PM
హరిద్వార్ లోని గంగాజలంపై ఆ రాష్ట్ర పీసీబీ నివేదిక ఆందోళన కలిగిస్తోంది. ఆ నీటిని తాగడానికి ఎట్టిపరిస్థితుల్లో వాడకూడదని తెలిపింది.
డెహ్రాడూన్: భారత్‌లోని పలు నదులలో పెరుగుతున్న కాలుష్య స్థాయిలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా హిందువులు ఎంతో పవిత్రంగా భావించే హరిద్వార్ లోని గంగాజలంపై పరిశోధకులు షాకిచ్చే వార్త చెప్పారు. ఈ జలాల్లోని నీటిపై ఉత్తరాఖండ్ లోని కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ) ఓ రిపోర్టును వెల్లడించింది. ఈ నీరు బి కేటగిరీకి వస్తుందని.. అందులోని నీరు స్నానాకికి సురక్షితమే కానీ, తాగేందుకు ఏమాత్రం పనికిరాదని తెలిపింది. నదీ నాణ్యతనకు పరీక్షించేందుకు నడుబిగించిన ఈ బోర్డు ఉత్తర్ ప్రదేశ్ కు సరిహద్దులోని మొత్తం ఎనిమిది ప్రాంతాల్లోని నీటిని పరీశీలించింది.
పీసీబీ తెలిపిన వివరాల ప్రకారం నీటి నాణ్యతను ఎ నుంచి ఇ వరకు ఐదు వర్గాలుగా విభజిస్తారు. ఇందులో ఎ వర్గం అతి ఎక్కు తక్కువ విషంగా మారిన నీటి ప్రమాణాన్ని సూచిస్తుంది. క్రిమిసంహారకాలు వాడిన తర్వాత తాగడానికి అనువైనదిగా భావిస్తారు. ఇ వర్గం అత్యంత విషపూరితమైనది. దీని ఆధారంగా గంగానదిలో నీటికి బి కేటగిరీని కేటాయించారు. అంటే ఇది స్నానానికి తప్ప తాగడానికి ఏమాత్రం అనువైనది కాదని తేల్చారు.
ఇటీవల ఢిల్లీలోని యమునా నదిలో కాలుష్య స్థాయిలు పెరుగుతుండటంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 1న యమునా నది నుంచి విషపూరితమైన నురగ మందంపాటి పొరలాగా అలుముకుంది. ఇది దేశవ్యాప్తంగా నదీ జలాల్లో పెరుగుతున్న కాలుష్యానికి అద్దం పడుతోంది. తాజాగా హరిద్వార్ లోని పరిశోధనలు భారత్ వంటి నదులలో నీటి నాణ్యతను కాపాడుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతున్నాయి. మెరుగైన కాలుష్య నియంత్రణ చర్యల అవశ్యకతపై దృష్టి సారించాల్సిన అవసరాన్ని తెలుపుతున్నాయి.
Bangalore: ‘ముడా’ కేసులో ఈడీ విచారణకు ఐఏఎస్ అధికారి..
Updated Date - Dec 04 , 2024 | 01:13 PM