ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Google Gemini: జెమిని తెచ్చిన తంటా.. ప్రధాని మోదీపై వివాదాస్పద సమాధానం.. గూగుల్ రియాక్షన్ ఏంటంటే?

ABN, Publish Date - Feb 24 , 2024 | 09:45 PM

ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్‌కు చెందిన అడ్వాన్స్‌డ్‌ వెర్షన్‌ ఏఐ టూల్‌ ‘జెమిని’ తాజాగా ఓ వివాదానికి తెరలేపిన విషయం అందరికీ తెలిసిందే. ప్రధాని మోదీ ఫాసిస్టా? కాదా? అని ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు ఆ టూల్ వివాదాస్పద సమాధానం ఇవ్వడంతో.. పెద్దఎత్తున విమర్శలు వచ్చాయి. ఏకంగా కేంద్ర ప్రభుత్వమే రంగంలోకి దిగాల్సి వచ్చింది. తప్పకుండా చర్యలు తీసుకుంటామంటూ ఐటీ మంత్రి ఘాటుగా స్పందించారు.

ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్‌కు చెందిన అడ్వాన్స్‌డ్‌ వెర్షన్‌ ఏఐ టూల్‌ ‘జెమిని’ తాజాగా ఓ వివాదానికి తెరలేపిన విషయం అందరికీ తెలిసిందే. ప్రధాని మోదీ ఫాసిస్టా? కాదా? అని ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు ఆ టూల్ వివాదాస్పద సమాధానం ఇవ్వడంతో.. పెద్దఎత్తున విమర్శలు వచ్చాయి. ఏకంగా కేంద్ర ప్రభుత్వమే రంగంలోకి దిగాల్సి వచ్చింది. తప్పకుండా చర్యలు తీసుకుంటామంటూ ఐటీ మంత్రి ఘాటుగా స్పందించారు. ఈ నేపథ్యంలోనే గూగుల్ దిద్దుబాటు చర్యలకు దిగింది. రాజకీయ అంశాలకు సంబంధించి తమ చాట్‌బాట్‌ అన్నిసార్లు నమ్మదగిన సమాధానాన్ని ఇవ్వకపోవచ్చని, దీనిని తాము సరిదిద్దుతామని తెలిపింది.


అసలేం జరిగింది?

సాధారణంగా.. మార్కెట్‌లోకి ఏదైనా ఒక కొత్త టూల్ వచ్చినప్పుడు నెటిజన్లు దానిపై రకరకాల ప్రయోగాలు చేస్తుంటారు. ఆ టూల్స్ సరిగ్గా పని చేస్తున్నాయా? తమ ప్రశ్నలకు ఎలాంటి సమాధానాలు ఇస్తాయి? అనే విషయాలపై క్లారిటీ తెచ్చుకోవడం తమవంతు ప్రయత్నాలు చేస్తారు. ఇప్పుడు జెమిని వంతు వచ్చింది. నిజానికి.. ఇది గతేడాదిలోనే మార్కెట్‌లోకి వచ్చింది కానీ, ఈమధ్య బాగా పాపులర్ అయ్యింది. ఈ క్రమంలోనే ఒక నెటిజన్.. ‘ప్రధాని మోదీ ఫాసిస్టా?’ అని ప్రశ్నించాడు. ఇందుకు జెమిని బదులిస్తూ.. మోదీ అవలంభించిన కొన్ని విధానాల వల్ల కొంతమంది ఆయన్ను ఫాసిస్ట్ అంటారని వివాదాస్పద సమాధానం ఇచ్చింది.

కానీ.. ఇదే ప్రశ్నను అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌, ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ గురించి అడిగినప్పుడు మాత్రం.. ‘కచ్ఛితంగా, స్పష్టంగా చెప్పలేం’ అంటూ ఆ ఏఐ టూల్ జవాబిచ్చింది. ఇందుకు సంబంధించిన స్క్రీన్ షాట్లను ఒక జర్నలిస్ట్ సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అవి వైరల్ అయ్యాయి. ఇది చూసిన నెటిజన్లు.. గూగుల్‌ పక్షపాతంగా పనిచేస్తోందంటూ విమర్శలు గుప్పించారు. అటు.. కేంద్రం కూడా ఈ అంశంపై సీరియస్‌ అయ్యింది. ఇది ఐటీ చట్టం, క్రిమినల్‌ కోడ్‌ నిబంధనల ఉల్లంఘనే అని ఐటీ శాఖ మంత్రి మండిపడ్డారు. దీనిపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని, నోటీసులు జారీ చేస్తామని ఆయన హెచ్చరించారు.


గూగుల్ సమాధానం

ఇలా విమర్శలు వెల్లువెత్తడం, కేంద్ర ప్రభుత్వం నుంచి హెచ్చరికలు రావడంతో.. గూగుల్ అధికార ప్రతినిధి ఒకరు స్పందించారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు తాము వెంటనే చర్యలు చేపట్టామని అన్నారు. జెమిని అనేది సృజనాత్మకత, ఉత్పాదకత సాధనంగా రూపొందించబడిందని చెప్పారు. అయితే.. ఇది సమకాలీన సంఘటనలు, రాజకీయ అంశాల గురించి అడిగినప్పుడు విశ్వసనీయమైన సమాధానాన్ని ఇవ్వకపోవచ్చని తెలిపారు. ఈ విషయంపై తాము మరింత కచ్చితత్వంతో పనిచేసేలా ‘జెమిని’ని అభివృద్ధి చేసేందుకు శ్రమిస్తున్నామని చెప్పుకొచ్చారు.

అయితే.. గూగుల్ ఈ విధంగా ఇచ్చిన వివరణపై కేంద్ర ఐటీశాఖ సహాయ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్ అసంతృప్తి వ్యక్తంచేశారు. ఇటువంటి కారణాలతో చట్టాల నుంచి తప్పించుకోలేరని అన్నారు. కచ్చితత్వం లేని వేదికలు, అల్గారిథమ్‌లపై డిజిటల్‌ యూజర్లతో ప్రయోగాలు చేయకూడదని సూచించారు. యూజర్లకు డేటా భద్రత, విశ్వసనీయమైన సేవలు అందించడం.. సామాజిక మాధ్యమాల మాధ్యమాల చట్టపరమైన బాధ్యత అని నొక్కి చెప్పారు. ఈ వ్యవహారంలో నోటీసులు పంపుతామని, ఆ దిశగా అడుగులు వేయడం జరిగిందని కూడా వెల్లడించారు.

Updated Date - Feb 24 , 2024 | 09:45 PM

Advertising
Advertising