ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Mpox: మంకీపాక్స్‌పై ప్రధాని మోదీ అప్రమత్తం.. అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష

ABN, Publish Date - Aug 18 , 2024 | 09:31 PM

పలు దేశాల్లో డేంజర్ బెల్స్ మోగిస్తున్న మంకీపాక్స్‌(Mpox) భారత్‌లోకి రాకుండా అడ్డుకునడమే లక్ష్యంగా ప్రధాని మోదీ(PM Modi) ఆదివారం అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఢిల్లీ: పలు దేశాల్లో డేంజర్ బెల్స్ మోగిస్తున్న మంకీపాక్స్‌(Mpox) భారత్‌లోకి రాకుండా అడ్డుకునడమే లక్ష్యంగా ప్రధాని మోదీ(PM Modi) ఆదివారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే ఈ వ్యాధిపై ప్రపంచ దేశాలకు హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ప్రిన్సిపల్ సెక్రటరీ డా.పీకే మిశ్ర నేతృత్వంలోని అధికారులతో బృందంతో ప్రధాని ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. మంకీపాక్స్‌ని ఎలా ఎదుర్కోవాలనే విషయంపై అధికారులు సమీక్షించారు.


మోదీ మాట్లాడుతూ.. "రాష్ట్రాల్లో టెస్టింగ్‌ ల్యాబ్‌లు ఏర్పాటు చేయాలి. వ్యాధిని త్వరగా గుర్తించేలా చర్యలు చేపట్టాలి. ఈ ఏడాదిలో ప్రపంచ వ్యాప్తంగా 15,600 మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే మంకీపాక్స్‌తో 537 మంది మృతి చెందారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆరోగ్య అత్యవసర స్థితిని ప్రకటించింది. భారత్‌లో ఈ ఏడాది ఒక్క మంకీ పాక్స్ కేసు కూడా నమోదు కాలేదు" అని తెలిపారు. ఆఫ్రికాలోని అనేక రాష్ట్రాల్లో మంకీపాక్స్ విస్తరిస్తున్న దృష్ట్యా ప్రపంచ ఆరోగ్య సంస్థ.. Mpoxను పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సర్న్ (PHEIC)గా ప్రకటించింది.


కేసులను సత్వరమే గుర్తించాలి..

కేసులను సత్వరమే గుర్తించేందుకు నిఘా పెంచాలని, సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలని ప్రధానమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ అధికారులను ఆదేశించారు. ముందస్తు రోగ నిర్ధారణ కోసం టెస్టింగ్ ల్యాబ్స్‌ని సిద్ధం చేయాలని సూచించారు. ప్రస్తుతం 32 ల్యాబ్‌లను పరీక్షల కోసం రెడీ చేశారు. వ్యాధిని అడ్డుకోవడానికి అందరూ కలిసికట్టుగా పని చేయాలని తెలిపారు. మంకీపాక్స్ లక్షణాలపై ప్రజల్లో విస్తృతమైన అవగాహన కల్పించాలని చెప్పారు.

For Latest News and National News click here

Updated Date - Aug 18 , 2024 | 09:31 PM

Advertising
Advertising
<