Gyanvapi : పూజలు కొనసాగించండి.. హైకోర్టు ఆదేశాలు
ABN, Publish Date - Feb 02 , 2024 | 02:42 PM
జ్ఞానవాపి దక్షిణ సెల్లార్‌లో హిందువుల ప్రార్ధనలకు అనుమతిస్తూ వారణాసి కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై 'స్టే' ఇచ్చేందుకు అలహాబాద్ హైకోర్టు (Allahabad High court) శుక్రవారంనాడు నిరాకరించింది. దీంతో జిల్లా కోర్టు ఆదేశాలను సవాలు చేసిన అంజుమన్ ఇంతేజామియా మాసాజిద్‌కు ఎదురుదెబ్బ తగిలింది.
వారణాసి: జ్ఞానవాపి (Gyanvapi) దక్షిణ సెల్లార్‌లో హిందువుల ప్రార్ధనలకు అనుమతిస్తూ వారణాసి కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై 'స్టే' ఇచ్చేందుకు అలహాబాద్ హైకోర్టు (Allahabad High court) శుక్రవారంనాడు నిరాకరించింది. దీంతో జిల్లా కోర్టు ఆదేశాలను సవాలు చేసిన అంజుమన్ ఇంతేజామియా మాసాజిద్‌కు ఎదురుదెబ్బ తగిలింది.
కాశీ విశ్వనాథ ఆలయం సమీపంలోని జ్ఞానవాపి భూగర్భ గృహంలో హిందూ దేవతలకు పూజలు చేసుకోవడానికి వారణాసి జిల్లా కోర్టు గత బుధవారం అంగీకరించింది. కోర్టు ఉత్తర్వులు వెలువడిన కొద్ది గంటల్లోనే సెల్లార్‌లో హిందూ దేవతలకు పూజలు మొదలయ్యాయి. సెల్లార్‌ను శుభ్రం చేసి లక్ష్మీదేవి, వినాయకుడికి అర్చకులు హారతులిచ్చారు. ఈ కాంప్లెక్స్‌లో హిందూ దేవతలకు పూజలు చేయడం 31 సంవత్సరాల తర్వాత ఇదే మొదటిసారి. హిందూ దేవతల పూజలకు అనుమతి ఇవ్వడాన్ని క్లాంప్లెక్స్ కమిటీ హైకోర్టులో గురువారం సవాలు చేసింది. జిల్లా కోర్టు తీర్పును అమలు చేయడంలో ఇంత ఆత్రుత ఎందుకని ప్రశ్నించింది. దీనికి ముందు జిల్లా కోర్టు తీర్పుపై కమిటీ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించి, హైకోర్టును ఆశ్రయించాలని సూచించింది. తాజా పరిణామాల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరక్కుండా వారణాసిలో ఫ్లాగ్‌మార్చ్, భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.
Updated Date - Feb 02 , 2024 | 02:57 PM