ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Himata Biswa Sarma: అసోం యాత్రలో రాహుల్‌ను పోలిన వ్యక్తి.. సీఎం సంచలన అభియోగం

ABN, Publish Date - Feb 02 , 2024 | 04:23 PM

కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అసోంలో జనవరి 18 నుంచి 25 వరకూ జరిపిన 'భారత్ జోడో న్యాయ్ యాత్ర'లో ఆయనను పోలిన వ్యక్తిని గుర్తించామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత్ బిస్వ శర్మ తెలిపారు. యాత్రలోని కొన్ని ప్రాంతాల్లో రాహుల్‌ను పోలిన వ్యక్తిని వాడుకున్నారని ఆయన ఆరోపించారు. త్వరలోనే ఆ వ్యక్తి పేరును బయటపెడతామని చెప్పారు.

దిస్పూర్: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) అసోం (Assam)లో జనవరి 18 నుంచి 25 వరకూ జరిపిన 'భారత్ జోడో న్యాయ్ యాత్ర'లో ఆయనను పోలిన వ్యక్తిని గుర్తించామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత్ బిస్వ శర్మ (Himanta Biswa Sarma) తెలిపారు. యాత్రలోని కొన్ని ప్రాంతాల్లో రాహుల్‌ను పోలిన వ్యక్తిని వాడుకున్నారని ఆయన ఆరోపించారు. త్వరలోనే ఆ వ్యక్తి పేరును బయటపెడతామని చెప్పారు.


''రాహుల్ గాంధీ తన యాత్రలో సరిగ్గా తనను పోలిన వ్యక్తినే వాడుకున్నట్టు గుర్తించాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అసోం పర్యటన ముగిసిన వెంటనే (ఫిబ్రవరి 4) ఆ వ్యక్తి ఎవరనే వివరాలను వెల్లడిస్తాం'' అని గౌహతిలోలో మాట్లాడుతూ శర్మ తెలిపారు. అసోంలో దాదాపు యాత్ర సాగినంత వరకూ ప్రజలకు అభివాదం చేసేందుకు తనను పోలిన వ్యక్తిని రాహుల్ తన వాహనం నుంచే ఉపయోగించుకున్నట్టు చెప్పారు. దీనిపై మీడియాలో ఒక వార్త రావడంతో పశ్చిమబెంగాల్ యాత్ర ప్రారంభానికి ముందే ఆ వ్యక్తిని గౌహతిలో వదిలేశారని తెలిపారు.


యాత్రకు అంతరాయం కలిగించిన కాంగ్రెస్‌ నేతలపై రెండు కేసులు నమోదైనట్టు శర్మ తెలిపారు. గౌహతిలో బారికేడ్లు విరగొట్టిన కేసులో రాహుల్ కూడా నిందితుడని, దీనిపై సిట్ విచారణ జరుపుతోందని చెప్పారు. రెండో కేసు జోర్హాట్‌లో నమోదైనట్టు తెలిపారు. ఈ కేసులో అసోం కాంగ్రెస్ విభాగం అధ్యక్షుడు భూపెన్ కుమార్ బోరా నిందితుడిగా ఉండగా, దీనిపై జిల్లా పోలీసులు విచారణ జరుపుతున్నారని చెప్పారు.

Updated Date - Feb 02 , 2024 | 04:30 PM

Advertising
Advertising