ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Hema Malini: అయోధ్యలో హేమమాలిని నృత్య ప్రదర్శన

ABN, Publish Date - Jan 14 , 2024 | 04:00 PM

యావద్దేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అయోధ్య రామాలయం ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో ఓ ప్రత్యేకత చోటుచేసుకోనుంది. బాలీవుడ్ డ్రీమ్‌గాళ్, బీజేపీ నేత హేమ మాలిని రామాయణం ఆధారిత నృత్యనాటకం ప్రదర్శించనున్నారు.

న్యూఢిల్లీ: యావద్దేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అయోధ్య రామాలయం (Ayodhi Ram Temple) ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో ఓ ప్రత్యేకత చోటుచేసుకోనుంది. బాలీవుడ్ డ్రీమ్‌గాళ్, బీజేపీ నేత హేమ మాలిని (Hema malini) రామాయణం ఆధారిత నృత్యనాటకం (Dance Drama) ప్రదర్శించనున్నారు. రామాలయ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో హేమమాలిని పాల్గొంటున్నట్టు ఆమె కార్యాలయం ఒక వీడియో క్లిప్ విడుదల చేసింది.


''ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న రామాలయ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొనేందుకు తొలిసారి అయోధ్య వస్తున్నాను. జనవరి 17న అయోధ్య ధామ్‌లో రామాయణం ఆధారిత నృత్య నాటకం ప్రదర్శించనున్నాను'' అని ఆ వీడియోలో హేమమాలిని తెలిపారు. దీంతో ఒక్కసారిగా అభిమానుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ''ఎప్పటికీ చెక్కుచెదరని అందం'' అంటూ ఒకరు ట్వీట్ చేయగా, ''చాలాకాలంగా మీ కోసం ఎదురుచూస్తున్నాం'' అని మరో యూజర్ సంతోషం వ్యక్తం చేశారు.


హేమమాలిని గత ఏడాది నవంబర్‌లో తన లోక్‌సభ నియోజకవర్గంలో జరిగిన సంత్ కబీర్ 525వ జయంతి కార్యక్రమాంలో నృత్య ప్రదర్శన చేశారు. ఇటీవల ముంబైలో జరిగిన ఇరా ఖాన్ నూపుర్ షఖెర వివాహ రెసెప్షన్‌లో అలనాటి నటి రేఖతో కలిసి కనిపించారు. బీజేపీ నేతగా ఆమె 2003లో రాజ్యసభ సభ్యురాలు అయ్యారు. హేమమాలిని భరతనాట్యంలో తనదైన ప్రతిభను చాటుకొంటుండగా, ఆమె కుమార్తెలు ఈషా డియోల్, అహనా డియోల్ ఒడిసీ డాన్సర్లుగా మంచి గుర్తింపు పొందారు. ఖజురహా డాన్స్ ఫెస్టివల్‌లో తల్లీకూతుళ్లు కలిసి నృత్య ప్రదర్శన ఇచ్చారు.

Updated Date - Jan 14 , 2024 | 04:00 PM

Advertising
Advertising